Harish Rao: మున్సిపల్ కార్మికులను సన్మానించిన హరీష్‌రావు
ABN, Publish Date - Jan 14 , 2024 | 11:33 AM
సిద్దిపేట: స్వచ్ సర్వేక్షన్‌లో దక్షణ భారత దేశంలోనే సిద్దిపేటకు క్లిన్ సిటీ అవార్డ్ రావడానికి కృషి చేయడంతో పాటు సంక్రాంతి పండగ కూడా కావడంతో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు మున్సిపల్ కార్మికులను సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్త బట్టలతో సన్మానించారు.
సిద్దిపేట: స్వచ్ సర్వేక్షన్‌లో దక్షణ భారత దేశంలోనే సిద్దిపేటకు క్లిన్ సిటీ అవార్డ్ రావడానికి కృషి చేయడంతో పాటు సంక్రాంతి పండగ కూడా కావడంతో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు మున్సిపల్ కార్మికులను సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్త బట్టలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశంలోనే క్లినేస్ట్ మున్సిపాలిటీ అవార్డ్ సిద్దిపేటకు రావడం గర్వకారణమన్నారు. దేశంలో 4,477 మున్సిపాలిటీల్లో స్వచ్ఛతలో సిద్దిపేటది 9వ స్థానమని, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానమని పేర్కొన్నారు. సిద్దిపేట ఇంతటి గౌరవం రావడంలో మున్సిపల్ కార్మికులు, ప్రజల సహకారమే కారణమని, సిద్దిపేటకు అవార్డు రావడం అంటే అది రాష్ట్రానికి దక్కిన గౌరవమేనని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస అభినందనలు లేక పోవడం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమని హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటపై ఈ ప్రభుత్వానికి ఉన్న కుల్లుకు ఇది నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోయినా.. జాతీయ స్థాయిలో సిద్దిపేటను గుర్తించారన్నారు. సిద్దిపేట పేరు లేకుండా అసలు జాతీయ అవార్డులే లేని పరిస్థితని.. ఈ అవార్డుతో ఇప్పటి వరకు సిద్దిపేటకు వచ్చిన అవార్డుల సంఖ్య 23 అని తెలిపారు. రోగం వస్తే మందులు ఇచ్చి నయం చేసే వైద్యులు ఎంత గొప్పవరో.. రోగమే రాకుండా పట్టణాన్ని స్వచ్చంగా ఉంచుతున్న సామాజిక వైద్యులు మున్సిపల్ కార్మికులని హరీష్‌రావు కొనియాడారు.
Updated Date - Jan 14 , 2024 | 11:33 AM