బ్యానర్ పెట్టకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది
ABN, Publish Date - Jul 24 , 2024 | 11:58 PM
ప్రజాపాలన సేవా కేంద్రాలు కనపడేలా బ్యానర్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎంపీడీవో రాఘవేందర్‌రెడ్డిపై కలెక్టర్ మనుచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీడీవోపై కలెక్టర్ మనుచౌదరి ఆగ్రహం
‘ప్రజా పాలన’ బ్యానర్ ఏర్పాటు చేయాలని ఆదేశం
సిద్దిపేటరూరల్, జూలై 24 : ప్రజాపాలన సేవా కేంద్రాలు కనపడేలా బ్యానర్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎంపీడీవో రాఘవేందర్‌రెడ్డిపై కలెక్టర్ మనుచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్ సిద్దిపేటరూరల్ మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి ప్రజాపాలన కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల సవరణను ఆన్‌లైన్ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవ కేంద్రం అని బ్యానర్ పెట్టకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుందని అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే బ్యానర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు సంబంధించి వస్తున్న దరఖాస్తులను స్వీకరించి వెంటనే కన్జ్యూమర్ నంబర్‌ను, విద్యుత్ యూఎ్‌ససీ నంబర్లను ఆన్‌లైన్ చేసి దరఖాస్తుదారులకు లబ్ధి చేకూర్చాలని చెప్పారు. కలెక్టరేట్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు
Updated Date - Jul 24 , 2024 | 11:59 PM