విమర్శలు మానుకోకపోతే గుణపాఠం తప్పదు
ABN, Publish Date - Sep 21 , 2024 | 11:15 PM
మాజీ జడ్పీటీసీ దాసరి కళావతి
చేర్యాల, సెప్టెంబరు 21: చిల్లర రాజకీయాలు చేస్తూ సీపీఎం నాయకులు వ్యక్తిగత విమర్శలు మానుకోకపోతే గుణపాఠం తప్పదని చేర్యాల మాజీ జడ్పీటీసీ దాసరి కళావతి హెచ్చరించారు. చేర్యాల పట్టణంలోని కాంగెరస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పదవిలో ఉన్నా, లేకపోయినా నిస్వార్థంగా నియోజకవర్గ అభివృద్ధికి కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి పాటుపడుతూ, ప్రజాదరణ పొందడం ఓర్వలేక నిరాశ, నిస్పృహలకులోనవుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసుకోవాలని పేర్కొన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను గాలికి వదిలివేసి దిగజారుడుతనానికి పాల్పడడంలో తనకుతానే సాటి అని విమర్శించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుర్మ ఆగంరెడ్డి, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్, ముస్త్యాల తార, మార్కెట్ డైరెక్టర్ తడక లింగం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొమురవెల్లి మండలకేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ మండల కార్యదర్శి సనాది భాస్కర్, మాజీ సర్పంచు చెరుకు రమణారెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు శ్రీనివాస్, భిక్షపతి, కనకరాజు, మల్లం బాలయ్య, బత్తిని నర్సింహులు, కాయిత మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 11:15 PM