ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చండి

ABN, Publish Date - Aug 06 , 2024 | 11:38 PM

సంగారెడ్డి రూరల్‌/హత్నూర/శివ్వంపేట/నర్సాపూర్‌, ఆగస్టు 6: ప్రజల ఆరోగ్యాలు పరిరక్షించేలా తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుపర్చాలని రాష్ట్ర, ఆర్కియాలజి శాఖ డైరెక్టర్‌ భారతీ హోళీకేరి అధికారులను ఆదేశించారు.

సంగారెడ్డిలో మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశిస్తున్న భారతీ హోళీకేరి

రాష్ట్ర, ఆర్కియాలజి శాఖ డైరెక్టర్‌ భారతీ హోళీకేరి

సంగారెడ్డి రూరల్‌/హత్నూర/శివ్వంపేట/నర్సాపూర్‌, ఆగస్టు 6: ప్రజల ఆరోగ్యాలు పరిరక్షించేలా తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుపర్చాలని రాష్ట్ర, ఆర్కియాలజి శాఖ డైరెక్టర్‌ భారతీ హోళీకేరి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా మంగళవారం సంగారెడ్డిలోని 32వ వార్డులో కలెక్టర్‌ వల్లూరు క్రాంతితో కలిసి ఆమె సందర్శించి పరిసరాలు మంచినీటి ట్యాంకులను పరిశీలించి మాట్లాడారు. ప్రతిఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ మనోజ్‌, డీపీవో సాయిబాబా, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌చౌహాన్‌, డీఈ ఇంతియాజ్‌, వార్డు ఔన్సిలర్‌ తదితరులు పాల్గొన్నారు. పచ్చదనం పరిశుభ్రతపై అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషిచేయాలని రాష్ట్ర, ఆర్కియాలజి శాఖ డైరెక్టర్‌ భారతీ హోళీకేరి, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. హత్నూర మండల పరిధిలోని బోర్పట్ల గ్రామాన్ని మంగళవారం సందర్శించి పాఠశాల, పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పచ్చదనం-స్వచ్ఛదనంలో అందరినీ భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా బోర్పట్ల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని కొందరు విద్యార్థులు వారి దృష్టికి తీసుకెళ్లగా.. ప్రధానోపాధ్యాయుడిపై అసహన వ్యక్తం చేశారు. బోర్పట్ల గ్రామ శివారులోని ఎపిటోరియా పరిశ్రమలో అక్రమ నిర్మాణాలు, కాలుష్యంఫై స్థానికులు కొందరు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ నిర్మాణాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అక్కడే ఉన్న జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబాను ఆదేశించారు. వారి వెంట ట్రైనీ కలెక్టర్‌ మనోజ్‌, తహసీల్దార్‌ ఫర్హీన్‌షేక్‌, ఎంపీడీవో శంకర్‌ ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం-పచ్చదనంలో ప్రజలంతా భాగ్యస్వాములు కావాలని రాష్ట్ర, ఆర్కియాలజి శాఖ డైరెక్టర్‌ భారతీ హోళీకేరి, మెదక్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం గొట్టిముక్ల గ్రామంలోని పాఠశాలలో తాగునీరు, మురుగు కాలువలను, రోడ్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ విద్యా బోధనపై ఆరాతీశారు. పాఠశాలలో మొక్కలు నాటి నీళ్లుపోశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్‌, ఎంపీవో తిరుపతిరెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్‌, నారాయణరావు, నరేందర్‌, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నర్సాపూర్‌ పట్టణంలో రాష్ట్ర, ఆర్కియాలజి శాఖ డైరెక్టర్‌ భారతీ హోళీకేరి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పర్యటించారు. పట్టణ సమీపంలో ఉన్న కోమటికుంట వద్ద పెద్దఎత్తున చెత్త ఉండడంతో పాటు విలువైన కుంట పరిధిలోని భూమి ఆక్రమణకు గురికావడం చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాయరావు చెరువును సందర్శించి పర్యాటక పరంగా అభివృద్ధి చేయడానికి అవకాశమున్నందున పూల మొక్కలతోపాటు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా కృషి చేయాలని సూచించారు. అలాగే 4వ వార్డులోని వాటర్‌ ట్యాంకు వద్దకొచ్చి ట్యాంకులో వచ్చే నీటిలో ఫ్లోరైడ్‌ శాతం ఎంత ఉందో పరిశీలించారు. పట్టణ పరిధిలోని హన్మంతాపూర్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో యాదయ్య, డీఆర్డీఏ పీడీ శ్రీనివా్‌సరావు, మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌గౌడ్‌, కమిషనర్‌ జైతురాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2024 | 11:38 PM

Advertising
Advertising
<