ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎడతెరిలేని వర్షం..

ABN, Publish Date - Sep 02 , 2024 | 12:17 AM

పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు

సంగారెడ్డి టౌన్‌/అర్బన్‌/జిన్నారం/రామచంద్రాపురం/కోహీర్‌/నారాయణఖేడ్‌/మనూరు: సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, చెరువులు అలుగు దుంకుతున్నాయి. పత్తిపంట నీట మునిగి, పలు గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. జిల్లాలో అత్యధికంగా వట్‌పల్లి మండలంలో 81.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా కల్హేర్‌ మండలంలో 4.3 మి.మీ వర్షపాతం నమోదయింది. అందోలులో 79 మి.మీ., సిర్గాపూర్‌లో 71 మి.మీ., కంగ్టిలో 64.5 మి.మీ., మనూరులో 61 మి.మీ., నిజాంపేటలో 60.5 మి.మీ., నాగల్‌గిద్దలో 59.8 మి.మీ., సిర్గాపూర్‌ 55.3 మి.మీ., నారాయణఖేడ్‌లో 50.8 మి.మీ., జహీరాబాద్‌లో 48.5 మి.మీ., ఝరాసంగంలో 35 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

ఫ జోగిపేట: అందోలు మండలంలోని కిచ్చన్నపల్లి వద్ద పిట్లం నుంచి సంగారెడ్డి వస్తున్న సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వర్షానికి అదుపుతప్పి రోడ్డు పక్కనే పొలంలోకి జారిపోయింది. ఎవరికీ గాయాలు కాలేదు. అందోలు నుంచి సాయిబాన్‌పేట వెళ్లే దారిలో గూడెం వద్ద భారీ వృక్షం కూలిపోయి రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఫ సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్‌ చెరువు గరిష్ట నీటి మట్టానికి చేరుకుని అలుగు పారుతున్నది. మండలంలోని ఈర్గిపల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై అదుపు కారు పంటపొలాల్లోకి దూసుకెళ్లింది.

ఫ పుల్‌కల్‌ మండలం సుల్తాన్‌పూర్‌ పెద్దచెరువు, చౌటకూర్‌లోని నాయిని చెరువు, శివంపేటలోని పెద్ద చెరువుతో పాటు కుంటల్లోకి నీరు చేరింది.

ఫ నారాయణఖేడ్‌ పట్టణం, నియోజకవర్గంలోని పంచగామ, నిజాంపేట గ్రామాల్లో కొన్ని ఇళ్లు పాక్షింగా కూలిపోయాయి.

ఫ సిర్గాపూర్‌ వాసర ఊర చెరువు నిండుకుండలా అలుగు పారుతున్నది.

ఫ మునిపల్లి మండలం అంతరాం-చిన్న చల్మెడ గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగడంతో ఇరు గ్రామాల మధ్య రాకపోలు నిలిచిపోయాయి.

ఫ రాయికోడ్‌-ధర్మారం గ్రామాల మధ్య బస్వన్నవాగు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాయికోడ్‌లోని ఓ కాలనీలో వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఫ కొండాపూర్‌ శివారులోని పెద్ద చెరువు నిండి రోడ్డుపై ప్రవహించడంతో తేర్పోలు, గొల్లపల్లి, మునిదేవునిపల్లి, గుంతపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఫ ఝరాసంగం మండలం జీర్లపల్లి చెరువు అలుగు పారుతున్నది.

ఫ ఝరాసంగం, కోహీర్‌, మునిపల్లి, నాగల్‌గిద్ద తదితర మండలాల్లో వందలాది ఎకరాల్లో పత్తి నీట మునిగింది.

ఫ మునిపల్లి మండలం మేళసంఘంలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కంది శివారులోని 65వ జాతీయ రహదారి పక్కన హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభం నేలకొరిగింది.

ఫ సదాశివపేట మండలం నందివాగు పొంగిపొర్లుతున్నది. మెల్గిరిపేట ప్రాజెక్టు నిండి గంగకత్వవాగు నిండుగా పారుతున్నది.

Updated Date - Sep 02 , 2024 | 12:17 AM

Advertising
Advertising