ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అసంపూర్తిగా డ్రైనేజీ పనులు

ABN, Publish Date - Jul 22 , 2024 | 12:05 AM

రోడ్లపై నిలుస్తున్న మురుగునీరు ఇబ్బందులు పడుతున్న ప్రజలు

బెజ్జంకిలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులు

బెజ్జంకి, జూలై 21: అధికారుల అలసత్వం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా మండల కేంద్రంలో చేపట్టిన డ్రైనేజీ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. పనులు పూర్తి కాకపోవడంతో ఇళ్ల మధ్యలో, రోడ్లపై మురుగునీరు నిలుస్తున్నది. మురుగునీరు చేరి దుర్వాసన వస్తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తప్పని ఇబ్బందులు

మండల కేంద్రంలో నెల రోజుల క్రితం చేపట్టిన డైన్రేజీ పనుల కోసం నివాసాల పక్క నుంచి కాలువ తీసి మురుగు నీరు వెళ్లేందుకు పైప్‌లైను వేశారు. సరైన ప్రణాళిక లేక వేసిన పైపులైన్లను అసంపూర్తిగా వదిలేయడంతో మురుగునీరు ఇళ్ల మధ్యనే నిలుస్తున్నది. దీనికి తోడు పారిశుధ్య నిర్వహణ లేక దోమల బెడద ఎక్కువయింది. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్‌ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు కాలువలను దాటలేక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. కాలనీవాసులు, ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.

పారిశుధ్య నిర్వహణ కరువు

మండల కేంద్రంలో ఉన్న కాలనీల్లోని పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం నిండి ఉన్నా వాటిని తొలగించడంలో అలసత్వంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో పారిశుధ్య నిర్వహణ అటకెక్కింది. కాలనీలోని మంచినీటి ట్యాంకుల వద్ద చెత్త పేరుకుపోయి ఉన్నా తొలగించకుండా వదిలేస్తున్నారు. మండల వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న అధికారులు వ్యాధులు ప్రబలేందుకు అవకాశం ఉన్న పారిశుధ్య నిర్వహణపై మాత్రం శ్రద్ధ చూపడంలేదు. అధికారులు వెంటనే స్పందించి డైన్రేజీ పనులను త్వరగాపూర్తి చేయడంతో పాటు పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు

పారిశుధ్య నిర్వహణ లేక డ్రైనేజీల నుంచి మురుగునీరు రోడ్లపైకి, సమీప ఇళ్లలోకి వస్తూ దుర్వాసన వెదజలుతున్నదని ఎంపీడీవోకు, పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ పనులను త్వరగా పూర్తిచేసి పారిశుధ్య నిర్వహణ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.

- సంగెం మధు, బెజ్జంకి గ్రామస్థుడు

Updated Date - Jul 22 , 2024 | 12:05 AM

Advertising
Advertising
<