ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళల ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళాశక్తి

ABN, Publish Date - Aug 28 , 2024 | 11:06 PM

కోహెడ, ఆగస్టు 28: స్వశక్తి మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళాశక్తిని ప్రభుత్వం అమలుచేస్తోంది.

పాడి గేదె నుంచి పాలు సేకరిస్తున్న మహిళ

పూర్తయిన లబ్ధిదారుల ఎంపిక

పాడి పశువుల కొనుగోలుపై అవగాహన

ఒక్కో యూనిట్‌ రూ.93 వేలు

కోహెడ, ఆగస్టు 28: స్వశక్తి మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళాశక్తిని ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇందులో భాగంగా మహిళలతో డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు చర్యలు చేపట్టారు. డెయిరీ యూనిట్‌లో భాగంగా పాడిగేదె కొనుగోలు రూ.75 వేలు, పశు దాణ రూ,7,200, గేదె రవాణా రూ.3 వేలు, పశు బీమా రూ.5,088, రవాణా బీమా రూ.443, షేర్‌ క్యాపిటల్‌ రూ.1,704, సురక్ష చార్జీలు రూ.835, మొత్తం యూనిట్‌ విలువ రూ.93,270 ఉంటుంది.

524 యూనిట్లు మంజూరు

ఇందిరా మహిళాశక్తి పథకం కింద మొదటివిడతలో హుస్నాబాద్‌ డివిజన్‌కు 524 యూనిట్లు కేటాయించారు. కోహెడ మండలానికి 156 యూనిట్లు, హుస్నాబాద్‌కు 84 యూనిట్లు, అక్కన్నపేటకు 144 యూనిట్లు, మద్దూరు మండలానికి 140 యూనిట్లు మంజూరయ్యాయి. స్వశక్తి సంఘాల్లో ఆసక్తి ఉన్న మహిళా సభ్యుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. కోహెడలో 156 యూనిట్లకు 173 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. తెలంగాణ మినహా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి పాడి గేదెలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క పాడి గేదె యూనిట్‌కు మొదటగా రూ.93,270 రుణం మంజూరు చేశారు. ఈ రుణంతో ఆవు లేదా గేదెను కొనుక్కోవాలి. ఈ రుణాన్ని లబ్ధిదారు నెలకు రూ.2,500 చొప్పున 48 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఆరునెలలు అనంతరం మరొక పాడి గేదె కొనుగోలుకు రుణం మంజూరు చేస్తారు.

పశు వైద్యులతో అవగాహన

మండలంలోని ఐకేపీ ఆధ్వర్యంలో పశువైద్యాధికారులతో మహిళా సంఘాల సభ్యులకు పాడి పశువుల కొనుగోలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. పశువుల బ్రీడ్‌ ఎంపిక, అధిక పాల దిగుబడిని ఇచ్చే పశువుల లక్షణాలు, అందించాల్సిన దాణ, వాటికి వచ్చే వ్యాధులు, దూడల పెంపకం, మొదలగు అంశాలపైన అవగాహన కల్పించారు.

బల్క్‌మిల్క్‌ సెంటర్‌కు ప్రతిపాదనలు

మహిళల నుంచి సేకరించిన మొదటి సంవత్సరం 3 వేల లీటర్ల పాలు ప్రభుత్వ డెయిరీ సిద్దిపేట విజయ కేంద్రానికి పంపించనున్నారు. ఇందుకుగాను కోహెడ మండలం బస్వాపూర్‌లో 7,500 లీటర్ల కెపాసిటీ గల బల్క్‌మిల్క్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని గుర్తించారు. తహసీల్దార్‌కు స్థలం గుర్తించి ఎంపిక చేసి ప్రతిపాదించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. సుమారు రూ.80 లక్షల ఖర్చవుతుందని ప్రతిపాదించారు.

15 రోజుల్లో గ్రౌండింగ్‌

పక్క రాష్ట్రాల నుంచి పాడి గేదెలను కొనుక్కోవాల్సి ఉంటుంది. 15 రోజుల్లో డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్‌ పూర్తిచేస్తాం. లబ్ధిదారులను ఎంపిక చేయడంతో పాటు పాడి గేదెల ఎంపికపై అవగాహనా సదస్సులు నిర్వహించడం జరిగింది.

- తిరుపతి, ఏపీఎం, కోహెడ

Updated Date - Aug 28 , 2024 | 11:06 PM

Advertising
Advertising