ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేరుందా...లేదా

ABN, Publish Date - Aug 14 , 2024 | 11:40 PM

రుణమాఫీకి సంబంధించిన కీలక ఘట్టానికి మరికొద్ది సమయమే మిగిలి ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత లక్షన్నర నుంచి 2లక్షల వరకు రుణమాఫీ జరుగనున్నది. రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. గత రెండు దఫాలుగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 2.29 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. దాదాపు రూ.1659 కోట్ల వరకు మాఫీ డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుత జాబితాలోనూ మరో లక్ష మంది వరకు ఉంటారని అంచనా.

రుణమాఫీపై ఉత్కంఠ

నేడు రూ.2 లక్షల్లోపు మాఫీ

ఇప్పటికే రెండు విడతలు పూర్తి

ఉమ్మడి జిల్లాలో దాదాపు లక్ష మందికి చేకూరనున్న ప్రయోజనం

రూ.2లక్షలు పైబడిన వారిలో అయోమయం

తుది జాబితాను బయటపెట్టని అధికారులు

ఆశావహుల్లో తర్జనభర్జన

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఆగస్టు 14 : రుణమాఫీకి సంబంధించిన కీలక ఘట్టానికి మరికొద్ది సమయమే మిగిలి ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత లక్షన్నర నుంచి 2లక్షల వరకు రుణమాఫీ జరుగనున్నది. రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. గత రెండు దఫాలుగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 2.29 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. దాదాపు రూ.1659 కోట్ల వరకు మాఫీ డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుత జాబితాలోనూ మరో లక్ష మంది వరకు ఉంటారని అంచనా.

ఆఖరి విడతగా రూ.2లక్షలలోపు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే తొలి, రెండో విడతల్లో లక్ష, లక్షన్నర రుణాలు పొందినవారికి మాఫీ జరిగింది. ప్రస్తుతం 2 లక్షల వరకు రుణం తీసుకున్నవారికి ప్రయోజనం చేకూరనున్నది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇదే తుది విడత కావడంతో రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు విడతల లబ్ధిదారుల జాబితాను ఒకరోజు ముందుగానే ప్రకటించారు. కానీ ఆఖరి విడతకు సంబంధించిన జాబితాపై తాత్సారం చేశారు. దాదాపు లక్ష మందికి ప్రయోజనం చేకూరనుంది.

తుది జాబితాపై ఆచితూచి..

జూలై 18వ తేదీన తొలి విడతగా రైతులకు రుణమాఫీ చేశారు. లక్ష వరకు రుణం పొందినవారందరికీ ప్రయోజనం కలిగింది. కాగా రెండ్రోజుల ముందుగానే లబ్ధిదారుల జాబితాను బయటపెట్టారు. ఎవరెవరికి మాఫీ జరుగుతోందననే విషయం తేటతెల్లమైంది. జూలై 30వ తేదీన రెండో విడతగా రూ.లక్షన్నర వరకు మాఫీ చేశారు. దీనికి సంబంధించిన జాబితా కూడా ఒక రోజు ముందుగానే బయటపడింది. కానీ ఆగస్టు 15కు సంబంధించిన ఆఖరి జాబితాపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఆచితూచి వ్యవహరించినట్లుగా కనిపిస్తోంది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్యపై వ్యవసాయాధికారులు, లీడ్‌ బ్యాంక్‌ అధికారులు దాటవేసే ప్రయత్నం చేశారు. తమకు సమాచారం రాలేదని అన్నారు. రాత్రి 7 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది.

అయోమయంలో రైతులు

రూ.2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందన్న ఆనందం కంటే జాబితాలో తమ పేరుందో.. లేదోననే ఉత్కంఠే రైతులను ఊపిరి బిగపట్టేలా చేసింది. లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల సంఖ్య కంటే రూ.2 లక్షలపైన రుణం పొందినవారి సంఖ్యనే మూడింతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే రూ.2 లక్షల పైబడిన రుణం, వడ్డీని ముందుగా చెల్లిస్తేనే తుదిజాబితాలో పేరుంటుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొంతమంది రూ.2 లక్షలపైనున్న రుణాన్ని చెల్లించారు. ఇంకొందరేమో ప్రభుత్వమే రూ.2 లక్షలు చెల్లిస్తే మిగతా మొత్తాన్ని తర్వాత చెల్లిస్తామనే ధీమాతో ఉన్నారు. అదే విధంగా రూ.3 లక్షల పైచిలుకు రుణాన్ని పొందినవారూ లేకపోలేదు. ఇలాంటి రైతులు కూడా తమ రుణమాఫీపై అయోమయంతోనే కనిపిస్తున్నారు. 3 లక్షలకు పైగా రుణం ఉంటే ఇప్పటికిప్పుడు మిగతా లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలనే పలువురు ప్రశ్నిస్తున్నారు. ముందుగా రూ.2 లక్షలు మాఫీ చేయాలని పట్టుబడుతున్నారు.

Updated Date - Aug 14 , 2024 | 11:40 PM

Advertising
Advertising
<