ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలి

ABN, Publish Date - Jul 29 , 2024 | 11:02 PM

సిద్దిపేట అగ్రికల్చర్‌, జూలై 29: జీవో 81,85 ప్రకారం 61 ఏళ్లు నిండిన 3,797 మంది వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని వారసత్వ వీఆర్‌ఏల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రాజలింగం ప్రభుత్వాన్ని కోరారు.

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వారసత్వ వీఆర్‌ఏల సంఘం నాయకులు

వారసత్వ వీఆర్‌ఏల సంఘం సిద్దిపేట అధ్యక్షుడు గుడుమల్ల రాజలింగం

సిద్దిపేట అగ్రికల్చర్‌, జూలై 29: జీవో 81,85 ప్రకారం 61 ఏళ్లు నిండిన 3,797 మంది వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని వారసత్వ వీఆర్‌ఏల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రాజలింగం ప్రభుత్వాన్ని కోరారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో వారసత్వ వీఆర్‌ఏల సంఘం జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 61 ఏళ్లు నిండిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాల నియామకానికి సంబంధించి చర్చించారు. అనంతరం ప్రభుత్వం వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజలింగం మాట్లాడుతూ.. తమకు ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగాలు కల్పించి తమ బతుకులు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ మండలాల వీఆర్‌ఏలు వెంకటస్వామి, సత్యం, మహేష్‌, ఆసిఫ్‌, సంతో్‌షకుమార్‌, తిక్కన బాలరాజు, సుందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2024 | 11:02 PM

Advertising
Advertising
<