ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘కొమ్మూరి’ మానసికస్థితిని పరీక్షించుకోవాలి

ABN, Publish Date - Sep 20 , 2024 | 11:10 PM

సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న మల్లారెడ్డి

చేర్యాల, సెప్టెంబరు 20: జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి తన మానసికస్థితిని వెంటనే పరీక్షించుకోవాలని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. కొమురవె ల్లి మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి వరుస ఓటములతో మానసికంగా కుంగిపోయారని ఎద్దేవా చేశారు. ఎలాంటి హోదా లేకున్నా ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారని సొంతపార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నా కనువిప్పు కలగడంలేదని పేర్కొన్నారు. తనకు ఓట్లు వేయలేదని కార్యకర్తలు, ప్రజలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని విమర్శించారు. జనగామ, చేర్యాల ప్రాంతాభివృద్ధికి అడ్డంకులు కలిగిస్తుండడం తగదన్నారు. ఇప్పటికైనా ఈప్రాంత సమస్యల పరిష్కారానికి పాటుపడాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, నాయకులు బద్దిపడిగ కృష్ణారెడ్డి, అత్తిని శారద, దాసరి ప్రశాంత్‌, తేలు ఇస్తారి, బోయిని మల్లేశం, కర్రోల్ల ఎల్లయ్య, ఆరుట్ల రవీందర్‌, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 11:10 PM