ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యంత్రంతో వరినాట్లు

ABN, Publish Date - Jul 23 , 2024 | 11:23 PM

అక్కన్నపేట, జూలై 23: వానాకాలంలో వరి సాగుచేసేందుకు ముందుకొచ్చిన అన్నదాతలకు నాట్ల సమయంలో కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది.

అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో యంత్రంతో వరి నాట్లు వేస్తున్న రైతులు

కూలీలు దొరక్కపోవడంతో యంత్రాల వైపు రైతుల మొగ్గు

ఖర్చు తక్కువ.. సమయం ఆదా

అక్కన్నపేట, జూలై 23: వానాకాలంలో వరి సాగుచేసేందుకు ముందుకొచ్చిన అన్నదాతలకు నాట్ల సమయంలో కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో సమయానికి నాట్లు వేయక దిగుబడి తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో కొందరు రైతులు వ్యవసాయ యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్‌లో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో యంత్రం సాయంతో వరినాట్లు వేస్తున్నారు. మంగళవారం మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో వరి యంత్రంతో రైతులు నాట్లు వేశారు. వరినాటు యంత్రంతో నాట్లు వేస్తే ఎకరానికి రూ.4 వేలు తీసుకుంటున్నారు. అదే కూలీలతో నాట్లు వేస్తే ఎకరానికి రూ.6 వేల ఖర్చు వస్తుంది. దీంతో ఎకరానికి రూ.2 వేల వరకు ఖర్చు తగ్గుతుందని, సమయం కూడా ఆదా అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. కూలీల కొరతను అధిగమించి సరైన సమయానికి నాట్లు వేయొచ్చని చెబుతున్నారు.

కూలీలు దొరక్కపోవడంతో..

కూలీలు దొరక్కపోవడంతో యంత్రంతో వరినాటు వేయించాను. సమయం ఆదాతో పాటు.. ఖర్చు తక్కువగా అవుతుంది. యంత్రంతో నాటు వేస్తే రూ.4 వేలు అవుతుండగా.. కూలీలతో వేయిస్తే రూ.6 వేలు వరకు అవుతుంది. యంత్రంతో నాలుగు ఎకరాలు నాటు వేయించాను.

- పీచర వెంకటేశ్వరరావు, రైతు, గోవర్ధనగిరి

Updated Date - Jul 23 , 2024 | 11:23 PM

Advertising
Advertising
<