మెదక్ స్టేడియానికి ఇందిరాగాంధీ పేరెలా కొనసాగిస్తారు..?: బీజేపీ
ABN, Publish Date - Sep 24 , 2024 | 11:05 PM
మెదక్ అర్బన్, సెప్టెంబరు 24: మెదక్ స్టేడియానికి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇందిరాగాంధీ పేరెలా కొనసాగిస్తారని, వెంటనే శిలాఫలకంపై పేరు తొలగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
మెదక్ అర్బన్, సెప్టెంబరు 24: మెదక్ స్టేడియానికి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇందిరాగాంధీ పేరెలా కొనసాగిస్తారని, వెంటనే శిలాఫలకంపై పేరు తొలగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీవైఎ్‌సవో దామోదర్‌రెడ్డిని కలిసి ఆయన వినతిపత్రాలు అందజేసి మాట్లాడారు. మెదక్ నుంచి ఇందిరాగాంధీ గెలిచి ప్రధాని అయితే ఈ ప్రాంతానికి చేసింది ఏమిలేదన్నారు. అప్పటి మంత్రి కరణం రాంచంద్రరావు విజ్ఞప్తి మేరకు ఎన్టీఆర్ హయాంలో స్టేడియాన్ని మంజూరు చేయించారన్నారు. 2000 సంవత్సరంలో సీఎం నారా చంద్రబాబు హయాంలో స్టేడియాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. అప్పటి నుంచి మెదక్ స్టేడియంగానే కొనసాగుతోందన్నారు. 2018లో ప్రధాని మోదీ సర్కార్ సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.5.50 కోట్లను ఖేలో ఇండియా ద్వారా మంజూరు చేసిందన్నారు. అప్పటి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు లోపల కాంగ్రెస్.. బయట బీఆర్‌ఎ్‌సలా వ్యవహరించి అధికారులను తప్పుతోవ పట్టించారని ఆరోపించారు. వెంటనే శిలాఫలకంపై ఇందిరాగాంధీ పేరు తొలగించి మెదక్ స్టేడియంగా కొనసాగించాలని, లేదా క్రీడలకు స్ఫూర్తి అయిన మేజర్ ద్యాన్ చంద్, రామచంద్రరావు పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం పరిణిత సోమశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ఎన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - Sep 24 , 2024 | 11:05 PM