ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెడికల్‌ కాలేజీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:14 PM

సంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 24: మెడికల్‌ కాలేజీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని మెడికల్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి డిమాండ్‌ చేశారు.

సంగారెడ్డిలో కార్మికులతో మాట్లాడుతున్న మెడికల్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి

మెడికల్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి

సంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 24: మెడికల్‌ కాలేజీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని మెడికల్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి డిమాండ్‌ చేశారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో శనివారం కార్మికులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయకుండా విస్మరించారని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికులను గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే కార్మికులను కనీస వేతనాలు అమలు చేయాలని, లేకపక్షంలో పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సదానందం, మహేందర్‌, లక్ష్మణ్‌, నాగార్జున, సునీత, భాగ్యలక్ష్మి, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:14 PM

Advertising
Advertising
<