దేశ భద్రత బీజేపీతోనే సాధ్యం: రాజాసింగ్
ABN, Publish Date - May 06 , 2024 | 11:31 PM
జహీరాబాద్, మే 6: దేశ భద్రత కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
జహీరాబాద్, మే 6: దేశ భద్రత కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలో సిద్ది హోటల్ నుంచి శివాజీ విగ్రహం వరకు రోడ్‌షో నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రజలు మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారన్నారు. కాంగ్రె్‌సకు ఓటేస్తే ఉగ్రవాదాన్ని పెంపొందించే విధంగా ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు. అనంతరం జహీరాబాద్ ఎంపీఅభ్యర్థి బీబీపాటీల్ మాట్లాడుతూ మోదీ హయాంలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మాజీ డీసీసీబి చైర్మన్ జైపాల్‌రెడ్డి మాట్లాడారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొల్ల భాస్కర్ బీజేపీలో చేరారు. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పేర్కొన్నారు. జహీరాబాద్ పట్ణంలోని ఆదర్శనగర్, హనుమాన్‌మందిర్, దత్తగిరి కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
దేశం, ధర్మం కోసం బీజేపీ పనిచేస్తుంది
దేశంకోసం, ధర్మం కోసం, న్యాయం కోసం బీజేపీ పనిచేస్తున్నదని జహీరాబాద్ పార్లమెంటరీ ప్రభారీ గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరిఅంజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన పదేళ్లలో నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు.
బీజేపీతోనే దేశాభివృద్ధి
పెద్దశంకరంపేట, మే 6: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ మండలాధ్యక్షుడు కోణం విఠల్ తెలిపారు. పెద్దశంకరంపేటలోని బీజేపీ కార్యాలయం వద్ద పట్టణానికి చెందిన పలు యువజన సంఘాలకు చెందిన 100కు పైగా యువకులు, రామోజీపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి సాయిలుతో పాటు దాదాపు 50 మంది సోమవారం విఠల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, బీజేపీ మండల నాయకులు సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.
బీజేపీలో చేరిన సిర్గాపూర్ జడ్పీటీసీ
కల్హేర్, మే 6: సిర్గాపూర్ జడ్పీటీసీ రాఘవరెడ్డితో పాటు సొంత గ్రామమైన సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు సంజీవరెడ్డి, భూంరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్రీనివా్‌సరెడ్డితో సహా 80 మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు బీజేపీలో చేరారు. బీబీ పాటిల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.విజయపాల్‌రెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Updated Date - May 06 , 2024 | 11:31 PM