ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిధులు లేక.. నిలిచిన పీహెచ్‌సీ పనులు

ABN, Publish Date - Aug 30 , 2024 | 12:02 AM

నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని కోరుతున్న ప్రజలు

అసంపూర్తిగా ఉన్న అనాజీపూర్‌ పీహెచ్‌సీ

రాయపోల్‌, ఆగస్టు 29: గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల అనారోగ్య సమస్యలను తీర్చడంతో పాటు పిల్లలకు వివిధ రకాల వ్యాక్సిన్‌లను వైద్య సిబ్బంది ఆయా గ్రామాల్లో ఉన్న పీహెచ్‌సీల్లో ఇస్తూ ఉంటారు. అలాంటి ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణం అర్ధాంతరంగా అగిపోయింది. రాయపోల్‌ మండలంలో ఐదు ప్రాథమిక ఉపకేంద్రాలు ఉండగా లింగారెడ్డిపల్లి కేంద్రానికి సొంత భవనం ఉంది. రాయపోల్‌, రాంసాగర్‌ కేంద్రాలకు కిరాయలేని అద్దె భవనాలు ఉన్నాయి. వడ్డెపల్లి కేంద్రానికి ఇటీవలే నిధులు మంజూరు కావడంతో టెండర్లు కూడా పూర్తయ్యాయి. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అనాజీపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి గతంలో రూ. 20లక్షలు మంజూరయ్యాయి. నాలుగు నెలల క్రితం 80 శాతం భవన నిర్మాణం పూర్తి చేశారు. ఇంకా ఫ్లోరింగ్‌, విద్యుత్‌ ఫిట్టింగ్‌, పెయింటింగ్‌, ప్లంబింగ్‌, కిటికీలతో పాటు మరుగుదొడ్ల పనులు మిగిలి ఉన్నాయి. దీంతో గ్రామంలో వైద్య సేవలు అందించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరగా నిధులు అయిపోవడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.

నిధులు మంజూరు కాగానే పూర్తి చేస్తాం

అనాజీపూర్‌ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణం కోసం మంజూరైన నిధులు అయిపోయాయి. సుమారు మరో రూ. 5లక్షల నిధులు మంజూరు అయితే నిర్మాణ పనులు పూర్తవుతాయి. మంజూరు కాగానే నిర్మాణ పనులు పూర్తి చేయిస్తాం

- రామ్‌కుమార్‌, పీఆర్‌ఏఈ

Updated Date - Aug 30 , 2024 | 12:02 AM

Advertising
Advertising