ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూలగొట్టుడు.. పడగొట్టుడేనా మీ పాలన

ABN, Publish Date - Aug 27 , 2024 | 11:11 PM

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాకలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక, ఆగస్టు 27: కుక్కలు పసిపిల్లలను చంపేస్తే, పల్లెలు రోగాలతో తల్లడిల్లుతుంటే, పాలన గాడి తప్పి అస్తవ్యస్తంగా మారితే పట్టించుకోని ప్రభుత్వం కేవలం కూలగొట్టుడు, పడగొట్టుడుతోనే కాలం వెళ్లదీస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్తప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గస్థాయిలో వివిధ శాఖ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. వసతి గృహాల్లోని సదుపాయాలపై, విద్యార్థుల పరిస్థితిపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం ఇప్పటివరకు నయాపైసా నిధులు విడుదల చేయలేదన్నారు. కొత్తరోడ్ల వేయడం దేవుడెరుగని, ప్రధాన రహదారులు వర్షానికి ధ్వంసమైతే కనీసం మరమ్మతులు కూడా చేయించలేదని ఆరోపించారు. పల్లెల్లో పారిశుధ్యం మొత్తం పంచాయతీ కార్యదర్శుల మీద వేసి, ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని, అప్పు పుట్టినన్నిరోజులు కార్యదర్శులు ఏడు నెలలు పనులు చేశారని, ఇప్పుడు పరిస్థితి వాళ్లకు కూడా తలకు మించిన భారంగా మారి చేతులు ఎత్తేశారన్నారు. రుణమాఫీ సక్రమంగా లేదని, రైతు బంధు ఇవ్వలేదని, వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మల్లించడానికే హైడ్రా పేరుతో హైడ్రామాకు తెరలేపారన్నారు. సమావేశంలో అధికారులు తదితులున్నారు.

Updated Date - Aug 27 , 2024 | 11:11 PM

Advertising
Advertising
<