సర్పంచులకు పెండింగ్ బిల్లులను చెల్లించాలి
ABN, Publish Date - Sep 16 , 2024 | 11:38 PM
సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు బాల్‌రాజు
మిరుదొడ్డి, సెప్టెంబరు 16: 9 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులను వెంటనే మంజూరు చేయాలని మిరుదొడ్డి సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు బాల్‌రాజు డిమాండ్ చేశారు. మిరుదొడ్డిలో మాజీ ఎంపీపీ ఉపాఽధ్యక్షుడు రాజు, బీఆర్‌ఎస్ ముఖ్యనాయకుడు తోటకమలాకర్‌రెడ్డితో కలిసి సోమవారం మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించకుండా ప్రస్తుత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులను ఏకం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. వారివెంట బీఆర్‌ఎస్ నాయకులు లింగం, బాల్‌నర్సింహులు, శ్రీనివాస్ తదితరులున్నారు.
మధ్యాహ్న భోజన కార్మికులకు..
మిరుదొడ్డి, సెప్టెంబరు 16: మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి డిమాండ్ చేశారు. మిరుదొడ్డిలో సోమవారం మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు నెలనెలా బిల్లులను చెల్లించకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే అంగన్‌వాడీ కేంద్రాలను ఏ విధంగా గుడ్లను సరఫరా చేస్తుందో అదేమాదిరిగా ప్రభుత్వ పాఠశాలలకూ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ మిరుదొడ్డి కార్యదర్శి అంజయ్య, మధ్యాహ్న భోజన కార్మికులు పద్మ, చంద్రయ్య, లావణ్య, భాగ్యమ్మ, లక్ష్మి, లలిత, బాలవ్వ తదితరులున్నారు.
Updated Date - Sep 16 , 2024 | 11:38 PM