ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Aug 09 , 2024 | 12:23 AM

ఆర్డీవో రామ్మూర్తి

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో రామ్మూర్తి

అక్కన్నపేట, ఆగస్టు 8: గ్రామాల్లోని అధికారులందరూ సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని హుస్నాబాద్‌ ఆర్డీవో రామ్మూర్తి సూచించారు. మండలంలోని రైతు వేదికలో గురువారం వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడకుండా ఉండేందుకు గ్రామస్థాయి అధికారులే ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, వారు మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. మండల కేంద్రంలో అద్దె భవనాల్లో నడిచే ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి వాటి నిర్మాణాలను చేపట్టేందుకు స్థల సేకరణ చేయాలని తహసీల్దార్‌కు సూచించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేకాధికారి మహేష్‌, ఎంపీడీవో జయరాం, తహసీల్దార్‌ అనంతరెడ్డి, పంచాయతీరాజ్‌ డీఈ మహేశ్వర్‌, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 12:23 AM

Advertising
Advertising
<