ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్పొరేట్‌ అనుకూల విధానాలను వెనక్కి తీసుకోవాలి

ABN, Publish Date - Aug 09 , 2024 | 11:24 PM

సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్‌

నారాయణరావుపేట, ఆగస్టు 9: కేంద్రం కార్పొరేట్‌ అనుకూల విధానాలను వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తూనికి మహేష్‌ డిమాండ్‌ చేశారు. క్విట్‌ ఇండియా పోరాట స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలను క్విట్‌ చేస్తూ దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా శుక్రవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తిగా కార్పొరేట్‌కు అనుకూలంగా ఉందని, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేకమైనదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశాన్ని మోసం చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు బ్లాకులను కార్పొరేట్లకు అప్పగించే కుట్రలను వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనంగా 26 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ఇప్పటికైనా ఆలోచన చేసి బడ్జెట్‌లో మార్పులు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శ్రీకాంత్‌, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 11:24 PM

Advertising
Advertising
<