క్విట్ ఇండియా ఉద్యమం నేటి తరానికి స్ఫూర్తిదాయకం
ABN, Publish Date - Aug 13 , 2024 | 11:39 PM
నర్సాపూర్, ఆగస్టు 13: దేశ స్వాతంత్రం కోసం ప్రజలందరిలో జాతీయ భావం తీసుకువచ్చి, వారు శాంతియుతంగా ఉద్యమం చేసి బ్రిటీష్ వారు వెళ్లిపోయేలా చేసిన క్విట్ ఇండియా ఉద్యమం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.
ఫ ప్రొఫెసర్ కోదండరాం
నర్సాపూర్, ఆగస్టు 13: దేశ స్వాతంత్రం కోసం ప్రజలందరిలో జాతీయ భావం తీసుకువచ్చి, వారు శాంతియుతంగా ఉద్యమం చేసి బ్రిటీష్ వారు వెళ్లిపోయేలా చేసిన క్విట్ ఇండియా ఉద్యమం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కృషి విజ్ణాన గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం క్విట్ ఇండియా జాతీయ ఉద్యమంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ప్రిన్సిపాల్ దామోదర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ 1942లో మొదలైన క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా శాంతియుతంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలలో కూడా చైతన్యం తీసుకువచ్చిందన్నారు. నేటి తరం కూడా చరిత్ర కూడా తెలుసుకోవాలని అది తెలిస్తేనే వర్తమానంలో రాణిస్తామన్నారు. చరిత్రనే వర్తమానాన్ని శాసిస్తుందన్నారు. అయితే నేడు వచ్చిన సాంకేతిక పరిజ్ణానంతో పాటు మారిన కాలానుగుణంగా చరిత్ర తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తద్వారా సంస్కృతి సంప్రదాయాలు మరిచిపోతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవులరాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్ తదితరులు మాట్లాడుతూ నేటి యువతరానికి చరిత్ర తెలుసేలా కృషి విజ్ణాన సంస్థ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కృషి విజ్ణాన సంస్థ అధ్యక్షులు లక్ష్మీకాంతరావు, మాజీ ఎస్పీ మల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివా్‌సగుప్తా, మాజీ ఎంపీపీలు శ్రీనివా్‌సగౌడ్, లలిత, కాంగ్రెస్ నాయకులు రవీందర్‌రెడ్డి, శ్రీనివా్‌సరావు, సుదర్శన్‌గౌడ్, నరేందర్‌రెడ్డి,మణిదీ్‌పతో పాటు పలువురు పాల్గొన్నారు. సెమినార్ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా అందులో ప్రతిభ చూపిన వారికి సంస్థ తరుపున సత్కరించి చరిత్రకు సంబంధించిన పుస్తకాలను బహుకరించారు.
Updated Date - Aug 13 , 2024 | 11:39 PM