ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రుణమాఫీ కోసం ‘రణం’

ABN, Publish Date - Aug 20 , 2024 | 11:58 PM

బెజ్జంకి, ఆగస్టు 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో అర్హులైన తమకు రుణమాఫీ కాలేదని రైతులు బ్యాంకు ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులను నిలదీశారు.

బెజ్జంకి మండలం తోటపల్లి ఇండియన్‌ బ్యాంకు ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు

బ్యాంకుల వద్ద రైతుల పడిగాపులు

జాబితాలో పేరు లేకపోవడంతో ఆందోళనలు

బెజ్జంకి, ఆగస్టు 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో అర్హులైన తమకు రుణమాఫీ కాలేదని రైతులు బ్యాంకు ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులను నిలదీశారు. బెజ్జంకి మండలంలోని తోటపల్లి ఇండియన్‌ బ్యాంకు పరిధిలో ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులు పంట రుణం తీసుకున్నారు. సంబంధిత బ్యాంకు పరిధిలో సగానికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు.. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమకు రుణమాఫీ కాలేదని నిలదీశారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది మూలంగానే తాము నష్టపోయామని ఆరోపిస్తూ బ్యాంకు షెటర్‌ను మూసివేశారు. సిద్దిపేట జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడారు. అర్హత ఉండి రుణమాఫీ కాని రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మాఫీ అయ్యేలా చూస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. అలాగే మండల కేంద్రంలోని రైతువేదికలో పంట సాగు మెళకువల పట్ల శాస్త్రవేత్తలతో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మహేష్‌ హాజరయ్యారు. విషయం తెలుసుకున్న మండల కేంద్రంతో పాటు, పలు గ్రామాల రైతులు రైతువేదిక వద్దకు చేరుకుని, తమకు రుణమాఫీ కాలేదని నిలదీశారు. మండలంలోని సంబంధిత బ్యాంకుల్లో రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు.

బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయం వద్ద బారులు

చేర్యాల, ఆగస్టు 20: ప్రభుత్వం దఫాలవారీ పంట రుణమాఫీ అమలుచేసిన క్రమంలో చేర్యాల, కొమురవె ల్లి, ధూళిమిట్ట, మద్దూరు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలాల రైతులు తమ వివరాలు తెలుసుకోవడంతో పాటు లోన్‌ రెన్యూవల్‌ చేసుకునేందుకు చేర్యాల పట్టణంలోని పలు బ్యాంకులకు పరుగెత్తుతున్నారు. దీంతో ఆయా బ్యాంకులు రైతులతో కిటకిటలాడుతున్నాయి. మంగళవారం చేర్యాల పట్టణంలోని ఎస్‌బీఐ, ఏడీబీ బ్రాంచ్‌కి రైతులు అధిక సంఖ్యలో తరలిరావడంతో మేనేజర్‌ శ్రీలత రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంకు ఆవరణలో టెంట్‌ వేయించి కుర్చీలు ఏర్పాటుచేశారు. తాగునీటి వసతి కల్పించడంతో ఓపికగా ఉండి అలసట తీర్చడంతో ఆమెను అభినందించారు. సాంకేతిక కారణాల వల్ల రూ.1 నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీ కాని వారు గ్రీవెన్స్‌ దరఖాస్తులు అందించేందుకు వ్యవసాయాధికారి కార్యాలయానికి తరలివచ్చారు.

కల్హేర్‌లోనూ ఆందోళన

కల్హేర్‌, ఆగస్టు 20: రుణమాఫీ కోసం విధించిన నిబంధన ప్రక్రియ సజావుగా లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రుణాలు చెల్లించి, సకాలంలో రెన్యూవల్‌ చేయించిన రైతులకు సంబంధించి రుణమాఫీ జాబితాలో పేరు లేకపోవడంతో మంగళవారం కల్హేర్‌ వ్యవసాయ కార్యాలయానికి చేరుకుని ఆందోళన పట్టారు. వివిధ సాంకేతిక కారణాలతో రుణమాఫీ వర్తింపజేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ సిబ్బందిని ఆశ్రయించి దరఖాస్తులు చేసుకుంటున్నారు.

రైతులు ఆందోళన చెందవద్దు: ఏడీఏ

రుణమాఫీ జాబితాలో పేర్లు లేని రైతులు ఆందోళన చెందవద్దని నారాయణఖేడ్‌ వ్యవసాయ శాఖ ఏడీఏ నూతన్‌కుమార్‌ అన్నారు. మంగళవారం కల్హేర్‌లోని రైతువేదికలో రైతులతో మాట్లాడి వారి సందేహాలకు సమాధానమిచ్చి, రుణమాఫీ జరగని రైతుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వారితో మాట్లాడుతూ రైతులకు సాంకేతిక కారణాలతోనే రుణమాఫీ కాలేదని, ఆందోళన చెందవద్దన్నారు. వారంరోజుల్లో అందరికీ రుణమాఫీ రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు సంతోషకుమారి, క్రిష్ణవేణి పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2024 | 11:58 PM

Advertising
Advertising
<