ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్లకు మరమ్మతులు చేయరూ

ABN, Publish Date - Sep 20 , 2024 | 11:08 PM

భారీ వర్షాలకు కోతకు గురైన రహదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు

వల్లంపట్ల నుంచి ఉప్పరోనిగడ్డకు వెళ్లే దారిలో కల్వర్టు వద్ద కోతకు గురై కొట్టుకుపోయిన రోడ్డు

మద్దూరు, సెప్టెంబరు 20: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్లు కోతకు గురై ప్రమాదకరంగా మారినా మరమ్మతులు చేపట్టకపోవడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాహనదారులు ప్రాణాలనరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగించాల్సిన దుస్థితి. మండలంలో ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు వల్లంపట్ల నుంచి ఉప్పరోని గడ్డకు వెళ్లే కల్వర్టు వద్ద రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. గతంలో ఇదే కల్వర్టు కోతకు గురై కొట్టుకుపోగా కేవలం మట్టిపోసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. వల్లంపట్ల నుంచి కూటిగల్‌కు వెళ్లేదారిలో నిర్మించిన కల్వర్టుకు కొద్ది నెలల క్రితం మరమ్మతులు చేపట్టినా కోతకు గురై ప్రమాదకరంగా ఉన్నది. లక్కపల్లి నుంచి రేబర్తికి వెళ్లే దారిలో కల్వర్టు వద్ద రోడ్డుకు కోతకు గురై ప్రమాదకరంగా మారడంతో పాటు రోడ్డుపై పెద్దపెద్ద కంకరాళ్లు తేలాయి. ధర్మారం పిట్టలగూడెం నుంచి లక్కపల్లికి వచ్చే దారిలో బస్టాండ్‌ సమీపంలోనూ అదే సరిస్థితి. మండల ప్రత్యేకాధికారులు కోతకు గురై ప్రమాదకరంగా మారిన రోడ్లను సందర్శించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా మండల అధికారులు గ్రామాల్లో ప్రమాదకరంగా మారిన రోడ్లను సందర్శించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Sep 20 , 2024 | 11:08 PM