ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిమ్మారెడ్డిపల్లి-కొమురవెల్లి రోడ్డును బాగుచేయరూ..

ABN, Publish Date - Sep 14 , 2024 | 10:56 PM

చేర్యాల, సెప్టెంబరు 13: చేర్యాల మండలం గుర్జకుంట క్రాస్‌రోడ్డు నుంచి కొమురవెల్లి మండలం ఐనాపూర్‌ శివారు రాజీవ్‌ రహదారి తిమ్మారెడ్డిపల్లి స్వాగతతోరణం వరకు ఆర్‌అండ్‌బీ పరిధిలో గల బీటీరోడ్డు పలు ప్రదేశాల్లో దెబ్బతిని ప్రమాదకరంగా మారింది.

కొమురవెల్లిలో బీటీరోడ్డుపై ఇటీవల మట్టి పోసినప్పటికీ దెబ్బతిని ఏర్పడిన గుంతలు

మరికొద్దిరోజుల్లో మల్లన్న జాతర

మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌

చేర్యాల, సెప్టెంబరు 13: చేర్యాల మండలం గుర్జకుంట క్రాస్‌రోడ్డు నుంచి కొమురవెల్లి మండలం ఐనాపూర్‌ శివారు రాజీవ్‌ రహదారి తిమ్మారెడ్డిపల్లి స్వాగతతోరణం వరకు ఆర్‌అండ్‌బీ పరిధిలో గల బీటీరోడ్డు పలు ప్రదేశాల్లో దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. ఈ దారిపై చేర్యాల ప్రాంత ప్రజలు, కొమురవెల్లి మల్లన్న దర్శనం కోసం ఇదే రహదారి గుండా చేరుకుంటారు. అయితే గుర్జకుంట క్రాస్‌ రోడ్డు నుంచి తిమ్మారెడ్డిపల్లి వరకు పలు ప్రదేశాల్లో రోడ్డు దెబ్బతిని గుంతలమయవడంతో ప్రయాణీకులు నానాతంటాలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మరింత దెబ్బతినడంతో చీకట్లో ప్రయాణించాలంటే భయాందోళన చెందుతున్నారు. మరికొద్దిరోజుల్లో కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభంకానుండటంతో మూడునెలలపాటు భక్తుల రాక భారీగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ స్థానికులు, సీపీఎం నాయకులు ఇటీవల కొమురవెల్లి మండల కేంద్రంలో నిరసన వ్యక్తంచేశారు. పలు ప్రదేశాల్లో డ్రైనేజీ, వర్షం నీరు నిలిచి చిత్తడిగా మారడంతో పోలీసులు, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తాత్కాలికంగా మట్టితో చదును చేసినా మూన్నాళ్లకే మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. ఐనాపూర్‌ శివారులో గుంతల వద్ద కంకర కుప్ప ప్రమాదకరంగా మారింది. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి గుర్జకుంట క్రాస్‌రోడ్డు నుంచి రాజీవ్‌ రహదారి వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రమాదాల బారి నుంచి ప్రయాణికులను రక్షించాలని కోరుతున్నారు.

Updated Date - Sep 14 , 2024 | 10:56 PM

Advertising
Advertising