ధరణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి
ABN, Publish Date - Aug 03 , 2024 | 11:00 PM
సంగారెడ్డి రూరల్/మెదక్/సిద్దిపేట అగ్రికల్చర్, ఆగస్టు 3: ధరణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్లను సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్
సంగారెడ్డి రూరల్/మెదక్/సిద్దిపేట అగ్రికల్చర్, ఆగస్టు 3: ధరణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్లను సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించి, ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సక్సేషన్ పెండింగ్, మ్యుటేషన్ లాంటి దరఖాస్తుల రికార్డులను పరిశీలించి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్‌వో పద్మజారాణి, ఆర్డీవో వసంతకుమారి, కలెక్టరేట్ ఏవో పరమేశం, మెదక్ నుంచి కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్లు, సిద్దిపేట నుంచి కలెక్టర్ మనుచౌదరి, డీపీవో దేవకీదేవి, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, బన్సీలాల్, రామ్మూర్తి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
Updated Date - Aug 03 , 2024 | 11:00 PM