ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరిహారం ఇవ్వరు.. పనులు చేయరు

ABN, Publish Date - Jul 17 , 2024 | 11:26 PM

కుకునూరుపల్లి, జూలై 17: గత కేసీఆర్‌ ప్రభుత్వం మల్లన్నసాగర్‌ నుంచి తపా్‌సపల్లి రిజర్వాయర్‌కు లింకు కాలువల ద్వారా నీటిని తరలించాలనే కృత నిశ్చయంతో కాలువ నిర్మాణ పనులను ప్రారంభించింది.

కుకునూరుపల్లి మండలం లకుడారం శివారులో నిలిచిన కాలువ పనులు

రూ.290 కోట్ల అంచనాలతో 9 కిలోమీటర్ల కాలువ నిర్మాణం

రైతుల నుంచి 120 ఎకరాల భూ సేకరణ

ప్రభుత్వం మారడంతో నిలిచిన కాలువ నిర్మాణ పనులు

పరిహారం కోసం రైతుల ఎదురుచూపులు

కుకునూరుపల్లి, జూలై 17: గత కేసీఆర్‌ ప్రభుత్వం మల్లన్నసాగర్‌ నుంచి తపా్‌సపల్లి రిజర్వాయర్‌కు లింకు కాలువల ద్వారా నీటిని తరలించాలనే కృత నిశ్చయంతో కాలువ నిర్మాణ పనులను ప్రారంభించింది. 2022 సంవత్సరంలో రూ.290 కోట్ల అంచనాలతో 9 కిలోమీటర్ల మేర ఈ కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణ బాధ్యతలను కావేరి ఇంజనీరింగ్‌ అనే ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. దీనికోసం ఐదు గ్రామాల రైతుల నుంచి భూమిని సేకరించి పనులను మొదలుపెట్టారు.

ఐదు గ్రామాలు.. 200 ఎకరాలు

వరంగల్‌ జిల్లా ధర్మాసాగర్‌ నుంచి బొమ్మపూర్‌ రిజర్వాయర్‌, బొమ్మపూర్‌ నుంచి తపా్‌సపల్లి రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోస్తున్నారు. ధర్మసాగర్‌ దాదాపు 80 కిలోమీటర్లు దూరం కావడంతో పక్కనే ఉన్న మల్లన్నసాగర్‌ నుంచి తపా్‌సపల్లి రిజర్వాయర్‌కు తరలించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 9 కిలోమీటర్ల లింకు కాలువ నిర్మాణాన్ని చేపట్టింది. దీనికి సిద్దిపేట జిల్లా కుకునూరులల్లి మండలంలోని మంగోల్‌, కోనాయిపల్లి, మెదినీపూర్‌, లకుడారం, తపా్‌సపల్లి రైతుల నుంచి 200 ఎకరాల భూమి అవసరం ఉండగా.. 120 ఎకరాలను సేకరించి పనులు ప్రారంభించారు. 200 మీటర్ల సొరంగం పనులు, రెండు కిలోమీటర్లు కాలువ నిర్మాణ పనులు జరిగాయి. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.16 లక్షల పరిహారం అందజేస్తామని చెప్పింది. కానీ మూడేళ్లవుతున్నా.. ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా పరిహారం అందించలేదు. ఐదు గ్రామాల రైతులకు దాదాపు రూ.30 కోట్ల పరిహారం రావాల్సి ఉన్నది.

ప్రభుత్వం మారడంతో నిలిచిన పనులు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ లింకు కాలువ నిర్మాణాన్ని చేపట్టింది. కానీ గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో ఆరు నెలలుగా కాలువ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. నిధుల లోటుతోనే పనులు ఆగినట్లు తెలుస్తున్నది. నిర్మాణ పనుల కూలీల కోసం, నిర్మాణ సంస్థ వాహనాలు, సామగ్రి కోసం లకుడారం, మెదినీపూర్‌ గ్రామాల శివారులో తాత్కాలిక వసతులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పనులు నిలిచిపోవడంతో సామగ్రిని, వాహనాలను ఇక్కడి నుంచి తరలించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ కాలువ నిర్మాణ పనులను చేపడుతుందో.. లేదో వేచి చూడాలి.

తహసీల్దార్‌ నుంచి మంత్రివరకు విన్నపాలు

కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు మండలస్థాయిలో ఉండే తహసీల్దార్‌ మొదలుకుని, ఆర్డీవో, కలెక్టర్‌, అప్పట్లో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇప్పుడు నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అయినా రైతులకు పరిహారం అందలేదు. అధికారులు, ప్రభుత్వం స్పందించి పరిహారాన్ని అందజేయాలని కోరుతున్నారు.

త్వరగా భూ పరిహారం అందజేయాలి

నాకు ఉన్న 2 ఎకరాల వ్యవసాయ భూమిలో ఎకరం భూమిని కాలువ నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం ఇచ్చాను. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు. ప్రభుత్వం స్పందించి భూ పరిహారాన్ని అందజేయాలి.

- జిల్ల నర్సింహులు, భూ బాధితుడు, లకుడారం

ప్రతిపాదనలు పంపాం

కాలువ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల వివరాలను ప్రభుత్వానికి అందజేశాం. నిధులు రాగానే పరిహారం పంపిణీ చేస్తాం.

- మల్లికార్జున్‌రెడ్డి, తహసీల్దార్‌, కుకునూరుపల్లి

Updated Date - Jul 17 , 2024 | 11:26 PM

Advertising
Advertising
<