చండూరులో దొంగల బీభత్సం
ABN, Publish Date - Jul 25 , 2024 | 11:08 PM
చిల్‌పచెడ్, జూలై 25: దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంటిలోంచి బంగారం, వెండి, మేకల మంద నుంచి ఐదు మేకలను ఎత్తుకెళ్లిపోయారు. ఈ సంఘటన చిల్‌పచెడ్ మండలం చండూరు గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది.
చిల్‌పచెడ్, జూలై 25: దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంటిలోంచి బంగారం, వెండి, మేకల మంద నుంచి ఐదు మేకలను ఎత్తుకెళ్లిపోయారు. ఈ సంఘటన చిల్‌పచెడ్ మండలం చండూరు గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన గుట్టమీది యాదమ్మకు కుమారుడు పోచయ్య, కోడలు ఉన్నారు. పోచయ్య కౌడిపల్లిలోని హెచ్‌పీ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజులాగే బుధవారం డ్యూటీకి వెళ్లాడు. యాదమ్మ కోడలు పీర్ల పండుగకు అమ్మగారి ఇంటికి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఒంటరిగా ఉన్న యాదమ్మ బుధవారం రాత్రి 9.30 గంటలకు పక్కనే ఉన్న గంగమ్మ ఇంట్లో పడుకున్నది. గురువారం ఉదయం 5.30 గంటలకు ఇంటికి వెళ్లి చూడగా.. తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికెళ్లే సరికి బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు కమ్మలు, 20 తులాల వెండి, రూ.18 వేల నగదును దోచుకెళ్లారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన పాతూరి యాదగిరికి చెందిన ఐదు మేకలను ఎత్తుకెళ్లిపోయారు. ఉదయం కొట్టం ఊడ్చేందుకు వెళ్లిన యాదగిరికి మేకలు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా జాడ దొరకలేదు. వాటి విలువ రూ.40 వేలు ఉంటుంది. పై రెండు ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షేక్ మహబూబ్ తెలిపారు.
Updated Date - Jul 25 , 2024 | 11:08 PM