ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాపం పసివాళ్లు..

ABN, Publish Date - Aug 06 , 2024 | 11:36 PM

పటాన్‌చెరు, ఆగస్టు 6: తల్లి ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన మాటలు కూడా రాని పసివాళ్లను గుర్తుతెలియని వ్యక్తులు పటాన్‌చెరు బస్టాండ్‌లో వదిలివెళ్లిన హృదయవిదారకమైన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకున్నది.

బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు

పటాన్‌చెరు, ఆగస్టు 6: తల్లి ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన మాటలు కూడా రాని పసివాళ్లను గుర్తుతెలియని వ్యక్తులు పటాన్‌చెరు బస్టాండ్‌లో వదిలివెళ్లిన హృదయవిదారకమైన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకున్నది. పటాన్‌చెరు ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు మూడేళ్ల బాలుడు, ఆరునెలల చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు పటాన్‌చెరు బస్టాండ్‌లో వదిలివెళ్లారు. గుక్కపట్టి పిల్లలు ఏడుస్తుండగా, అక్కడే పనిచేసే స్వీపర్‌ గుర్తించి అక్కున చేర్చుకుంది. బస్టాండ్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పిల్లలను పోలీ్‌సస్టేషన్‌కు తరలించి సంరక్షించారు. మంగళవారం ఉదయం మహిళా శిశుసంక్షేమ అధికారులు పిల్లలను స్వాధీనం చేసుకుని సంగారెడ్డికి తరలించారు. పోలీసులు పిల్లలను వదిలిన గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు వదిలివెళ్లారా, ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఇక్కడ వదిలివెళ్లారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా చిన్నారులను వివరాలు అడగ్గా సరిగ్గా చెప్పలేకపోతున్నారని మహిళా శిశు సంక్షేమ అధికారులు తెలిపారు.

Updated Date - Aug 06 , 2024 | 11:36 PM

Advertising
Advertising
<