ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీరపాండ్య కట్ట బ్రహ్మన ధైర్య సాహసాలు స్ఫూర్తి

ABN, Publish Date - Oct 01 , 2024 | 11:10 PM

పటాన్‌చెరు రూరల్‌, అక్టోబరు 1: బ్రిటీష్‌ పాలకుల అరాచకాలను ఎదిరించి వారి నియంతృత్వంపై కత్తి దూసిన మహాయోధుడు వీరపాండ్య కట్ట బ్రహ్మన అని కాంగ్రెస్‌ నేత నీలం మధుముదిరాజ్‌ తెలిపారు.

విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నీలం మధు ముదిరాజ్‌

కాంగ్రెస్‌ నేత నీలం మధుముదిరాజ్‌

పటాన్‌చెరు రూరల్‌, అక్టోబరు 1: బ్రిటీష్‌ పాలకుల అరాచకాలను ఎదిరించి వారి నియంతృత్వంపై కత్తి దూసిన మహాయోధుడు వీరపాండ్య కట్ట బ్రహ్మన అని కాంగ్రెస్‌ నేత నీలం మధుముదిరాజ్‌ తెలిపారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్‌ మండలం తుర్తిలో ముదిరాజ్‌ యువసేన యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీరపాండ్య కట్ట బ్రహ్మన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నీలం మధుకు నిర్వాహకులు చాపల వల, మంగళహారతులతో ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ అరాచకాలను, పన్ను వసూళ్లను ఎదిరించిన మహావీరుడు కట్ట బ్రహ్మన అని కొనియాడారు. మొదటి ఇంగ్లిష్‌ సైన్యాధిపతి అలాన్‌ దొర పెద్ద సైన్యంతో కోటపై యుద్ధానికి వస్తే వారిని తరిమికొట్టి ఓడించిన ఘనత వీర పాండ్య సొంతమన్నారు. అలాంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని నేటితరం యువత ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ యూత్‌ నాయకులు పిట్టల వంశీ, నేమురి నరేష్‌, కథలాపూర్‌ ముదిరాజ్‌ మండలాధ్యక్షుడు నర్సయ్యపల్లి మధు, మాజీ సర్పంచ్‌ కొలకాని శేఖర్‌, మక్కం గంగబుమయ్య, ఆంజనేయులు, మక్కం భాస్కర్‌, పిసారి సురేష్‌, లక్ష్మణ్‌, రాజేష్‌, మునిరాజ్‌, యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 11:10 PM