ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ ఖర్చులతో మాకు సంబంధం లేదు

ABN, Publish Date - Jul 31 , 2024 | 11:37 PM

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకీయోద్దీన్‌, కౌన్సిలర్లు

విలేకరులతో మాట్లాడుతున్న మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకీయోద్దీన్‌

గజ్వేల్‌, జూలై 31: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ కార్యాలయ భవన ప్రారంభోత్సవ ఖర్చుతో తమకు సంబంధం లేదని మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకీయోద్దీన్‌, కౌన్సిలర్లు తెలిపారు. గజ్వేల్‌ మునిసిపల్‌ కార్యాలయం వద్ద బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. మునిసిపల్‌ భవన ప్రారంభోత్సవ ఖర్చుకు సంబంధించిన అవినీతిపై గతంలోనే తామంతా బహిరంగ పరిచామని తెలిపారు. అప్పటి కమిషనర్‌, మునిసిపల్‌ చైర్మన్‌, అధికారులు ముందుగానే నిధులను డ్రా చేశారని, ఈ విషయమై తామంతా ప్రశ్నిస్తే ఎప్పటికప్పుడు దాటవేస్తూ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారన్నారు. ఈ విషయమై తాము అధికారులను ఆర్టీఐ ద్వారా కూడా ప్రశ్నించామని, సరైన ఆధారాలు ఇవ్వనందున ఆర్టీఐ కమిషనర్‌కు అప్పీల్‌ చేశామని తెలిపారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులకు కలసి చైర్మన్‌పై ఫిర్యాదు చేశామన్నారు. అత్యవసర పనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా చేతివాటం చూపే పనులకు నిధులు మంజూరు చేయడంతో అవిశ్వాసం ప్రవేశపెట్టామని, అవిశ్వాస అంశం కోర్టు పరిధిలో ఉండడం, పదవీ కాలం తక్కువగా ఉండడంతో అవిశ్వాస అంశాన్ని విరమించుకున్నట్లు తెలిపారు.

Updated Date - Jul 31 , 2024 | 11:37 PM

Advertising
Advertising
<