ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఊరునైనా విడిచిపెడతాం.. భూమిని మాత్రం విడిచిపెట్టం

ABN, Publish Date - Aug 06 , 2024 | 11:32 PM

సదాశివపేట, కొండాపూర్‌, ఆగస్టు 6: పుట్టి.. పెగిన ఊరునైనా విడిచిపెడతాం.. కానీ (రిజినల్‌ రింగు రోడ్డు) కోసం భూమిని మాత్రం విడిచిపెట్టమని సదాశివపేట మండలం పెద్దాపూర్‌, కొండాపూర్‌ మండలం గిర్మాపూర్‌ గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో వసంతకుమారి

ఆందోళన వ్యక్తం చేసిన (ఆర్‌ఆర్‌ఆర్‌) బాధితులు

సదాశివపేట, కొండాపూర్‌, ఆగస్టు 6: పుట్టి.. పెగిన ఊరునైనా విడిచిపెడతాం.. కానీ (రిజినల్‌ రింగు రోడ్డు) కోసం భూమిని మాత్రం విడిచిపెట్టమని సదాశివపేట మండలం పెద్దాపూర్‌, కొండాపూర్‌ మండలం గిర్మాపూర్‌ గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం పెద్దాపూర్‌లోని రైతువేదికలో సంగారెడ్డి ఆర్డీవో వసంతకుమారి, డీఎస్పీ సత్తయ్య, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడారు. (ఉత్తరభాగం-ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణ నిమిత్తం గత జూలై 15న నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. నోటిఫికేషన్‌లో సూచించిన సర్వే నెంబర్లలోని భూములను సర్వే చేశామన్నారు. భూసేకరణ సర్వే, ప్రజాభిప్రాయ సేకరణ పనులు 21 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. ముందుగా ఎంజాయ్‌మెంట్‌ సర్వేచేస్తే తప్పా ఏ రైతు భూమి ఎంత విస్తీరణంలో (ఆర్‌ఆర్‌ఆర్‌)లో వెళ్లేది తేలిపోతుందని, రైతులందరూ సహకరించాలని ఆర్డీవో కోరారు. పలువురు రైతులు మాట్లాడుతూ గ్రామాల్లో మా ఇళ్లను కూల్చేసి (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మించినా పరవాలేదు. కానీ దశాబ్దాలుగా నమ్ముకుని బతుకుతున్న మా భూములు మాత్రం ఇచ్చేది లేదన్నారు. మా భూములపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందా? అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 40 ఏళ్లలో మెదక్‌ జిల్లాలో సింగూర్‌ ప్రాజెక్టు, హైదరాబాద్‌ తాగునీటి పైప్‌లైన్‌ రోడ్డు, బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఓడీఎఫ్‌, ఐఐటీ, మూడు జాతీయ రహదారుల ఏర్పాటు కోసం చిన్న, సన్నకారు రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకుని సరైన నష్ట పరిహారం ఇవ్వలేదని గుర్తుచేశారు. జిల్లాలో ఏ అభివృద్ధి ప్రాజెక్టులు పెట్టినా పేద రైతుల భూములే కనిపిస్తాయా? అని ప్రశ్నించారు. (ఆర్‌ఆర్‌ఆర్‌)లో బడా రాజకీయ నాయకుల భూములు, రియల్‌ వ్యాపారుల భూములు, కంపెనీలకు చెందిన భూములను కాపాడేలా భూసర్వే, భూసేకరణ చేస్తారా? అని రైతులు అధికారులను నిలదీశారు. కేవలం ఇద్దరు రాజకీయ నాయకుల కోసం (ఆర్‌ఆర్‌ఆర్‌) డిజైన్‌ మార్చేశారని ఆరోపించారు. భూమికి భూమి, బహిరంగ మర్కెట్‌ విలువతో నష్టపరిహారం అందిస్తేనే తప్పా తమ భూములను వదులుకోమని రైతులు తేల్చిచెప్పారు. భూమిని కోల్పోతామనే బాధలో మాట్లాడుతున్నామే కానీ ఎవరినీ రెచ్చగొట్టేలా మాట్లాడడం లేదని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2024 | 11:32 PM

Advertising
Advertising
<