ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గురుకులంలో తప్పెవరిది..!

ABN, Publish Date - Aug 03 , 2024 | 10:59 PM

మునిపల్లి, ఆగస్టు 3: సంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని లింగంపల్లి గురుకుల కళాశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న రజినిరెడ్డి గతనెల 24న బదిలీపై వెళ్లింది. అయితే పాఠశాలకు తెలుగు టీచర్‌ రాలేదు.

విద్యార్థులు రోడ్డెక్కడానికి గల కారణాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటున్న ఎంఈవో దశరథ్‌

ఉపాధ్యాయురాలి కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

కలెక్టర్‌ ఆదే శాలతో ఎంఈవో విచారణ

మునిపల్లి, ఆగస్టు 3: సంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని లింగంపల్లి గురుకుల కళాశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న రజినిరెడ్డి గతనెల 24న బదిలీపై వెళ్లింది. అయితే పాఠశాలకు తెలుగు టీచర్‌ రాలేదు. బదిలీ అయిన విషయం విద్యార్థులకు తెలియకపోవడంతో గతనెల 26న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ప్రిన్సిపాల్‌ సురభి చైతన్య వద్దకెళ్లి తెలుగు టీచర్‌ రజినిరెడ్డి కళాశాలకు ఎందుకు రావడం లేదు సార్‌ అంటూ అడిగారు. ఇందుకు ప్రిన్సిపాల్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేకపోవడంతో చేసేదేమి లేక గతనెల 30న టీచర్‌ను తిరిగి రప్పించాలంటూ 165 ముంబయి జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ విషయాన్ని సంగారెడ్డి కలెక్టర్‌ క్రాంతి వల్లూరి సీరియ్‌సగా తీసుకుని గురువారం గురుకుల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు రోడ్డు పైకి వెళ్లి ధర్నా చేసేంతవరకు మీకు తెలియదా.. వారు బయటకు వెళ్తే.. మీరు ఏం చేస్తున్నారని ప్రిన్సిపాల్‌ చైతన్యతోపాటు సిబ్బందిని నిలదీశారు. దీంతో వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విచారణ చేపట్టాలని ఎంఈవో దశరథ్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంఈవో దశరథ్‌ శనివారం కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. మీరు ఎందుకు రోడ్డు పైకి వెళ్లి ధర్నా చేయాల్సి వచ్చింది. ఎవరైనా చేయండని ప్రేరేపించారా.. అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారో అడగాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ పీఈటీ, ఉపాధ్యాయులపై ఎంఈవో మండిపడ్డారు. విద్యార్థులు ధర్నా చేసిన రోజు ప్రిన్సిపాల్‌ అందుబాటులో లేకపోగా.. ఇన్‌చార్జి బాధ్యతలను ఎవరికీ అప్పగించకపోవడంతో ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యంపై విచారణ చేసి కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఎంఈవో తెలిపారు.

Updated Date - Aug 03 , 2024 | 10:59 PM

Advertising
Advertising
<