ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అధ్వానంగా చేర్యాల అంబేడ్కర్‌ చౌరస్తా

ABN, Publish Date - Jul 29 , 2024 | 10:59 PM

చేర్యాల, జూలై 29: చేర్యాల పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చౌరస్తా అధ్వానంగా మారింది. రోజులతరబడిగా నీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసంగా మారింది. వాహనాల రాకపోకలతో చిత్తడిగా మారడంతో పాటు గుంతలు ఏర్పడ్డాయి.

అంబేడ్కర్‌ చౌరస్తాలో నిలిచిన వరదనీరు

నీటి నిల్వతో చిత్తడిమయం, గుంతలు

చేర్యాల, జూలై 29: చేర్యాల పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చౌరస్తా అధ్వానంగా మారింది. రోజులతరబడిగా నీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసంగా మారింది. వాహనాల రాకపోకలతో చిత్తడిగా మారడంతో పాటు గుంతలు ఏర్పడ్డాయి. నామమాత్రంగా మొరంపోసినా చదును చేయకపోగా, కనీసం బ్లీచింగ్‌ కూడా చేయడం లేదు. ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం కోసం మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూల్చివేయడంతో రోడ్డు పక్కన పండ్ల వ్యాపారులు, చిరువ్యాపారులు తోపుడుబండ్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. కూడలి వద్ద తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్మారక స్తూపం, స్వాతంత్య్ర సమరయోధుడి స్మారకస్తూపం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలతో పాటు ఆర్టీసీ రిక్వెస్ట్‌ బస్టాప్‌ ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. రోడ్డు విస్తరణలో భాగంగా కొద్దిరోజుల క్రితం డ్రైన్‌ కాలువ నిర్మించి అమరవీరుల స్మారకస్తూపం ఆవరణలో నిలిపివేయడంతో పాటు అంబేడ్కర్‌ కూడలి ప్రదేశం పల్లంగా ఉండడంతో మురుగునీరు చేరి అధ్వానంగా మారుతుంది. దీంతో ప్రజలు, ప్రయాణికు లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నా మునిసిపల్‌ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jul 29 , 2024 | 10:59 PM

Advertising
Advertising
<