ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విషప్రచారం చేసేవారికి బుద్ధి చెప్పాలి

ABN, Publish Date - Dec 04 , 2024 | 06:09 AM

నమ్మి పదేళ్లు రాజ్యాన్ని అప్పగిస్తే ప్రజల సంపదంతా కొల్లగొట్టారని, అలాంటి వారు ఇప్పుడు ప్రజాప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రేపు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు యాప్‌ ప్రారంభం

తొలి విడతలో 4.50 లక్షల ఇళ్ల మంజూరు: పొంగులేటి

కూసుమంచి/జూలూరుపాడు, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): నమ్మి పదేళ్లు రాజ్యాన్ని అప్పగిస్తే ప్రజల సంపదంతా కొల్లగొట్టారని, అలాంటి వారు ఇప్పుడు ప్రజాప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువులో ప్రజాప్రభుత్వ ఏడాది విజయోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతారంలో సభను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 27రోజుల్లోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు 5వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి యాప్‌ను ప్రారంభించి ఈ పథకానికి శ్రీకారం చుడతారన్నారు. రాష్ట్రంలో తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - Dec 04 , 2024 | 06:09 AM