ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మా ప్రభుత్వాన్ని టచ్‌ చేయాలనుకుంటే పీకలు ఎగురుతాయ్‌ జాగ్రత్త!

ABN, Publish Date - May 12 , 2024 | 05:49 AM

‘పసికూన లాంటి మా ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నావు.. మిస్టర్‌ కేసీఆర్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని టచ్‌ చేసి చూడు పీకలు ఎగురుతాయ్‌ జాగ్రత్త’ అని మంత్రి పొన్నం

కేసీఆర్‌కు మంత్రి పొన్నం వార్నింగ్‌

హుస్నాబాద్‌, మే 11: ‘పసికూన లాంటి మా ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నావు.. మిస్టర్‌ కేసీఆర్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని టచ్‌ చేసి చూడు పీకలు ఎగురుతాయ్‌ జాగ్రత్త’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. శనివారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విలేకరులతో మంత్రి మాట్లాడారు. ‘బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించకుండా బీఆర్‌ఎస్‌ దిగజారి ప్రవర్తిస్తోంది. ఇది ప్రజలతో ఎన్నికైన, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ ప్రభుత్వం. కోన్‌ కిస్కాగాళ్లు ఎంతమంది వచ్చినా ఏమీ కాదు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బోణీ కొడితే కేసీఆర్‌కు అభినందనలు చెబుతా. ఎన్నికలు పూర్తికాగానే గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులకు ప్రాధాన్యమిచ్చి పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో ఒక్క ఎకరా బీడు లేకుండా చేయడమే నా ప్రథమ కర్తవ్యం. హుస్నాబాద్‌ ఆసుపత్రిని 250 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసి మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తాం.. ఈ విషయంలో హరీశ్‌రావు ఆందోళన చెందాల్సి అవసరం లేదు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు హుస్నాబాద్‌ నియోజకవర్గానికి వెంట్రుక మందం పని చేయలేదు. వారికి ఓటడిగే హక్కు లేదు. కరీంనగర్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేందర్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి’ అని కోరారు.

Updated Date - May 12 , 2024 | 05:50 AM

Advertising
Advertising