ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Sridhar Babu : రెరాతో ‘బిల్డ్‌నౌ’ అనుసంధానం

ABN, Publish Date - Dec 04 , 2024 | 05:49 AM

భవనాల డ్రాయింగ్‌లను పరిశీలించాలంటే రోజుల తరబడి ఎదురుచూడాలి.. ‘ఆక్యుపెన్సీ’ కావాలంటే సుదీర్ఘకాలం వేచి చూడాలి.. ఎక్కువ అంతస్తుల (హై రైజ్‌) భవనాల డ్రాయింగ్‌ల ఆమోదం కోసమైతే నెలల తరబడి నిరీక్షించాలి.. దరఖాస్తు

మొబైల్‌ ఆధారిత సైట్‌ తనిఖీ యాప్‌

ఐదు నిమిషాల్లో డ్రాయింగ్‌ల పరిశీలన

10 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌

రాష్ట్రంలో వ్యాపారానుకూల వాతావరణం

‘రియల్‌ ఎస్టేట్‌’లో హైదరాబాద్‌ టాప్‌

‘బిల్డ్‌నౌ’ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): భవనాల డ్రాయింగ్‌లను పరిశీలించాలంటే రోజుల తరబడి ఎదురుచూడాలి.. ‘ఆక్యుపెన్సీ’ కావాలంటే సుదీర్ఘకాలం వేచి చూడాలి.. ఎక్కువ అంతస్తుల (హై రైజ్‌) భవనాల డ్రాయింగ్‌ల ఆమోదం కోసమైతే నెలల తరబడి నిరీక్షించాలి.. దరఖాస్తు చేసుకోవడం నుంచి, ఫీజు చెల్లించడం వరకు ఎన్నో ఇబ్బందులు.. వీటన్నింటికీ పరిష్కారం చూపుతూ భవన నిర్మాణాల అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం టీజీబీపాస్‌ స్థానంలో ‘బిల్డ్‌నౌ’ అనే కొత్త ఏకీకృత ఆన్‌లైన్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ శ్రీధర్‌బాబు తెలిపారు. బిల్డ్‌నౌ ఆవిష్కరణ సందర్భంగా మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కొత్త వ్యవస్థ గురించి వివరించారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుత వ్యవస్థలో (టీజీబీపాస్‌) డ్రాయింగ్‌ల పరిశీలనకు రోజుల తరబడి సమయం పడుతుందని, హైరైజ్‌ భవనాల డ్రాయింగ్‌ల విషయంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆధునిక సాంకేతికతతో పనిచేసే బిల్డ్‌నౌ ద్వారా వినియోగదారులకు సులభతరమైన సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రజలకు అంతరాయం లేని సేవలను అందిస్తామని తెలిపారు. బిల్డ్‌నౌ ద్వారా దేశంలోనే అత్యంత వేగంగా 5 నిమిషాల్లో డ్రాయింగ్‌ పరిశీలన పూర్తి అవుతుందన్నారు. దరఖాస్తులోనే జీవో నిబంధనలు తెలుసుకునేందుకు మూడు భాషల్లో (తెలుగు, ఆంగ్లం, ఉర్దూ) ఏఐ ఆధారిత సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నూతన విధానంలో నాన్‌ హైరైజ్‌ భవనాల ఆమోదానికి పట్టే సమయం 21 నుంచి 15 రోజులకు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ సమయాన్ని 15 నుంచి 10 రోజులకు తగ్గించామని చెప్పారు. మొబైల్‌ ఆధారిత సైట్‌ పరిశీలన యాప్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. అధికారులు లేఅవుట్‌ నుంచే ఫొటోలు అప్‌లోడ్‌ చేయొచ్చని, సెబ్‌బ్యాక్‌, రోడ్డు వెడల్పు వంటి రియల్‌టైం డేటాను అప్‌లోడ్‌ చేయడానికి అనుమతిస్తున్నామని తెలిపారు. కొత్తగా అమలు చేసే అప్లికేషన్‌ను రెరాతో అనుసంధానం చేసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపార వృద్ధికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని వెల్లడించారు. నూతన వ్యవస్థపై ఆర్కిటెక్ట్‌లు, ప్రభుత్వ అధికారులు, కాలనీల సంఘాల పెద్దలకు రాబోయే రెండు నెలల్లో శిక్షణ ఇస్తామని చెప్పారు.


రూ.250 కోట్లకుపైగా ఆదాయం ఉన్న వారు అత్యధికం మనదగ్గరే

పురపాలక శాఖ ప్రగతి నివేదికను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మీడియాకు వివరించారు. 60 శాతానికి పైగా జనాభా పట్టణాలు, నగరాల్లోనే ఉన్నారని తెలిపారు. ఈ శాఖకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీన్ని స్వయంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా రాష్ట్ర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న విధానాలను మాత్రం ఆపబోమన్నారు. రాష్ట్రంలో వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పని చేస్తోందని చెప్పారు. రూ.250 కోట్లకు పైగా ఆదాయం ఉన్న సంపన్నులు దేశంలోనే అత్యధిక (467) మంది హైదరాబాద్‌లోనే ఉన్నారన్నారు. తర్వాత స్థానంలో బెంగళూరు ఉందని తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉందని.. అత్యధికంగా తీసుకుంటున్న గృహ రుణాలే దీనికి నిదర్శనమని వెల్లడించారు. ఐటీలో 9.7 లక్షల మంది నిపుణులు పని చేస్తున్నారని, దీనివల్ల ప్రపంచ స్థాయి కంపెనీలు వాటి కార్యకలాపాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుంటున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో కార్యాలయాల లీజు కోసం 34 మిలియన్‌ చదరపు అడుగుల స్థలం కావాలని, ఉద్యోగులకు మరో 1.30 లక్షల ఇళ్లు అవసరమవుతాయని తెలిపారు. టీజీబీపాస్‌ ద్వారా ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులకు రూ.750 కోట్ల ఆదాయం లభించిందన్నారు. రాష్ట్రంలో పురపాలక సంచాలకుల ఆధ్వర్యంలో 24 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిచెప్పారు.

Updated Date - Dec 04 , 2024 | 05:49 AM