ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాడు వైఎస్‌.. నేడు రేవంత్‌

ABN, Publish Date - Nov 20 , 2024 | 04:42 AM

సీఎం రేవంత్‌ రెడ్డిని ఉమ్మడి రాష్ట్ర దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క పోల్చారు. విజయోత్సవ సభలో వారు మాట్లాడుతూ సీఎం రేవంత్‌పై ప్రశంసలు కురిపించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మహిళల పురోగతి అంశాల్లో ఇద్దరూ ఒక్కటే

సీఎంపై మంత్రులు సీతక్క, సురేఖ వ్యాఖ్యలు

హనుమకొండ సిటీ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ రెడ్డిని ఉమ్మడి రాష్ట్ర దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క పోల్చారు. విజయోత్సవ సభలో వారు మాట్లాడుతూ సీఎం రేవంత్‌పై ప్రశంసలు కురిపించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆశయంతో నాడు వైఎస్‌ పరిపాలన సాగిస్తే నేడు సీఎం రేవంత్‌ రెడ్డి కూడా అదే దారిలో పని చేస్తున్నారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో వడ్డీ లేని రుణాలను అందిస్తున్నారని తెలిపారు. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర వ్యాపారాలతో మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించే మార్గాలను రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇక, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తర్వాత రేవంత్‌రెడ్డే ఉన్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్‌ నగరాభివృద్ధికి రూ.6వేల కోట్లు కేటాయించి ప్రజల ఆకాంక్షలను సీఎం రేవంత్‌ నెరవేర్చారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌ వరంగల్‌ అభివృద్ధి అంశంలో మాటలకే పరిమితమయ్యారన్నారు.

మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: భట్టి

వరంగల్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటానికి కృషి చేస్తున్నామని తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో 4వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని మహిళ సంఘాల ద్వారా చేపడతామన్నారు. ఈ ఏడాది వెయ్యి మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామని, ప్రాజెక్టు నిర్వహణకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి రోజునే కాళోజీ కళాక్షేత్రా న్ని ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరా గాంధీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.

‘మూసీ’పై ప్రతిపక్షాలది గగ్గోలు : కోమటిరెడ్డి

మూసీ నది ప్రక్షాళన చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. మూసీ ప్రభావం నల్లగొండ జిల్లాపైనా ఉందని, ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సీఎం రేవంత్‌ మూసీ ప్రక్షాళన చేపడితే ప్రతిపక్షాలు గగ్గోలు చేయడం సరికాదన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రజల మేలును తలచే వారు కాదని మండిపడ్డారు.

వరంగల్‌ అభివృద్ధే సీఎం లక్ష్యం : పొంగులేటి

హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయలేదని, నగరాభివృద్ధికి కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని తెలిపారు. కానీ, తమ ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌-2041 తీసుకొచ్చిందని, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ.210కోట్లు, భధ్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి, వరంగల్‌ బస్టాండ్‌ ఆధునికీకరణ తదితర అభివృద్ధి పనులకూ నిధులు మంజూరు చేసిందని అన్నారు.


త పదేళ్లలో ప్రగతి శూన్యం : జూపల్లి

బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని, పదేళ్లలో రాష్ట్రంలో సాధించిన ప్రగతి శూన్యమని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు. రైతులకు ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకున్నారని చెప్పారు. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయలేపోయిన బీఆర్‌ఎస్‌ బీరాలు పలుకుతోందని విమర్శించారు.

మాట నిలబెట్టుకున్నాం: దుద్దిళ్ల, పొన్నం

రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఇచ్చిన మాటలను అధికారం చేపట్టిన ఏడాదిలోపే కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టుకుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. మరో నాలుగేళ్లలో మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో పని చేస్తామని, ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఇక, రాష్ట్రం అప్పుల్లో చిక్కుకున్నా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో సీఎం రేవంత్‌ రెడ్డి వెనక్కు తగ్గలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాళేశ్వరం పేరిట బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుతిన్నారని ఆరోపించారు. కులగణన సర్వేతో నిరుపేదల జీవన అవసరాలు, అంచనాలు ప్రభుత్వానికి తెలుస్తాయని, ప్రతీ ఒక్కరూ సర్వేలో వివరాలు చెప్పాలని ప్రజలను కోరారు.

Updated Date - Nov 20 , 2024 | 04:42 AM