Warangal: వరుసగా 3 రోజులు సెలవులు.. ఎర్ర బంగారంతో నిండిపోయిన మార్కెట్
ABN, Publish Date - Jan 24 , 2024 | 09:02 AM
మిర్చి పంట మార్కెట్‌కు పొటెత్తింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. పండిన మిర్చి పంటను అమ్ముకోవడానికి రైతన్నల రాకతో మార్కెట్ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.
వరంగల్: మిర్చి పంట మార్కెట్‌కు పొటెత్తింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. పండిన మిర్చి పంటను అమ్ముకోవడానికి రైతన్నల రాకతో మార్కెట్ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. ఎల్లుండి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడంతో తమ పంటను అమ్ముకోవడానికి రైతులు మార్కెట్‌కు క్యూకట్టారు. గణతంత్రదినోత్సవం, నాలుగో శనివారం, ఆదివారం వరుసగా రావడంతో శుక్రవారం నుంచి మార్కెట్లు మూడు రోజులు పనిచేయవు. మిర్చి పంట ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఆలస్యం చేయకుండా మిర్చి పంటను ఇవాళే అమ్ముకునేందుకు రైతన్నలు మార్కెట్‌కు తరలివచ్చారు. మిర్చి బస్తాలతో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు నిండిపోయింది. దీంతో త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను రైతన్నలు కోరుతున్నారు.
Updated Date - Jan 24 , 2024 | 09:02 AM