ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

ABN, Publish Date - Mar 18 , 2024 | 11:30 PM

రాబోవు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించేలా ప్రజాప్రతినిధులు కృషిచేయాలని కల్వకుర్తి, అచ్చంపేట ఎమ్మెల్యేలు కశిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- వెల్దండలో ఎమ్మెల్సీ ఎన్నికల

సన్నాహక సమావేశం

వెల్దండ, మార్చి 18 : రాబోవు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించేలా ప్రజాప్రతినిధులు కృషిచేయాలని కల్వకుర్తి, అచ్చంపేట ఎమ్మెల్యేలు కశిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ కోరారు. సోమవారం మండల పరిధిలోని కేఎల్‌ఆర్‌ గార్డెన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లాపరిషత్‌ వైఎస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌, ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి, నియోజవర్గ పరిధిలోని అన్ని మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 107మందికి గాను 63మంది సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో వంశీకృష్ణ, నారాయణరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించి కానుకగా ఇద్దామని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేయడంతోపాటు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు కేవీఎన్‌రెడ్డి, ఎంపీపీలు పద్మ, జ్యోతి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, ఆనంద్‌కుమార్‌, విజయ్‌కుమార్‌రెడ్డి, భూపతిరెడ్డి, రాంరెడ్డి, భట్టు కిషన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండలశాఖ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:30 PM

Advertising
Advertising