ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad : కాంగ్రెస్‌లో జీవన్‌రెడ్డి తుపాను!

ABN, Publish Date - Jun 26 , 2024 | 04:09 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరిక.. కాంగ్రె్‌సలో కలకలానికి కారణమైంది. తనకు సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ని, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్‌సరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం పట్ల మనస్తాపం చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి..

ఎమ్మెల్సీకి రాజీనామా చేయడానికి సిద్ధం

  • మండలి చైర్మన్‌ లేకపోవడంతో వాయిదా

  • జీవన్‌తో మాట్లాడాల్సిందిగా

  • భట్టికి సూచించిన అధిష్ఠానం, సీఎం

  • గంటకుపైగా భట్టి, దుద్దిళ్ల మంతనాలు

  • హామీ లేనందున.. అలకవీడని జీవన్‌రెడ్డి

  • ఫోన్‌లో మాట్లాడిన దీపాదాస్‌ మున్షీ

  • నేడో రేపో ఆమెతో భేటీ

హైదరాబాద్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరిక.. కాంగ్రె్‌సలో కలకలానికి కారణమైంది. తనకు సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ని, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్‌సరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం పట్ల మనస్తాపం చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. తదుపరి కార్యాచరణపై ఆయన సోమవారమే జగిత్యాలలో తన అనుచరులతో మంతనాలు జరపడంతో.. మంత్రి శ్రీధర్‌బాబు, జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి జీవన్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. మంగళవారం సీన్‌ హైదరాబాద్‌కు మారింది.

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైన జీవన్‌రెడ్డి.. అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్‌ చేశారు. రాజీనామా పత్రాన్ని తీసుకునే అధికారం తనకు లేదని.. దాన్ని మండలి చైర్మన్‌కు ఇవ్వాలని ఆయన సూచించడంతో గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. తాను ప్రస్తుతం అందుబాటులో లేనని చైర్మన్‌ ఆయనకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, అధిష్ఠానం పెద్దలు.. జీవన్‌రెడ్డితో మాట్లాడాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు సూచించారు. దీంతో.. భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో గంటన్నరపాటు మంతనాలు జరిపారు. అయితే అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లేక పోవడంతో జీవన్‌రెడ్డి అలకవీడలేదని సమాచారం. కాగా.. జీవన్‌రెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సైతం మాట్లాడారు.


ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె.. బుధ లేదా గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. ఆమెతో భేటీ తర్వాత జీవన్‌రెడ్డి కార్యాచరణపైన స్పష్టత రానుంది. కాగా.. జీవన్‌రెడ్డి సీనియారిటీకి, గౌరవానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటామని.. ఏ నాయకుడినీ కోల్పోవడానికి పార్టీ సిద్ధంగా లేదని భట్టి విక్రమార్క తెలిపారు. జీవన్‌రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీవన్‌ రెడ్డి పార్టీలో సీనియర్‌ నాయకుడు, తమకందరికీ మార్గదర్శకుడని.. ప్రభుత్వాన్ని నడపడంలో ఆయన అనుభవాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుంటామని చెప్పారు.

జీర్ణించుకోలేకపోతున్నా..

పార్టీ మారితే వెంటనే సభ్యత్వం కోల్పోయేలా చట్టంలో మార్పులు తెస్తామంటూ ఏఐసీసీ హామీ ఇచ్చిందని.. దానికి భిన్నంగా రాష్ట్రంలో కాంగ్రె్‌సలోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలను తాను జీర్ణించుకోలేకపోతున్నానని జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిరంగా ఉందని.. మిత్రపక్షం సీపీఐకి ఒక సీటుందని ఆయన గుర్తుచేశారు. ఏడుగురు ఎమ్మెల్యేలున్న ఎంఐఎం.. బీజేపీతో కలిసి నడిచే పరిస్థితే లేదన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ప్రజల మెప్పును పొందడంపై దృష్టి పెట్టాలని జీవన్‌రెడ్డి సూచించారు. గత 40 ఏళ్లుగా క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీలో ఉన్న తాను.. పార్టీపరంగా లభించిన హోదాలో ఉండి పార్టీ నిర్ణయాన్ని విభేధించడం సరికాదన్నారు. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లు చెప్పారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అధిష్ఠానం ఆమోదంతోనే..

కాంగ్రెస్‌ పార్టీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరికలన్నీ అధిష్ఠానం ఆమోదంతో జరిగినవేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చేరికలపైన జీవన్‌రెడ్డి మనస్తాపం చెందడాన్ని, ఆయన రాజీనామాకు సిద్ధపడడాన్ని పెద్దగా పట్టించుకోలేదంటున్నాయి. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల్లోనూ జీవన్‌రెడ్డి ఓటమిపాలు కావడమూ ఈ ఎపిసోడ్‌కు అధిష్ఠానం అంతగా ప్రాధాన్యం ఇవ్వక పోవడానికి ఒక కారణంగా చెబుతున్నాయి. అధిష్ఠానం అంగీకారం లేకుండా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం జరగదన్న విషయం తెలిసీ.. హైడ్రామాకు జీవన్‌రెడ్డి తెరలేపడం అంతిమంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి మేలు చేకూరుస్తుందని పార్టీ పెద్దలు కొందరు అసహనం చెందుతున్నట్లు చెబుతున్నారు.

Updated Date - Jun 26 , 2024 | 04:09 AM

Advertising
Advertising