ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వాహనాలు నిలువ నీడ లేకపాయే!

ABN, Publish Date - Apr 06 , 2024 | 04:32 AM

వందల కోట్లు ఖర్చు చేసినా నిలువ నీడే లేదు.. చూద్దామన్నా ఒక్క చెట్టూ కనిపించదు... కార్లు, ద్విచక్ర వాహనాలు ఎండలో మగ్గాల్సిందే.. విశ్రాంతి గది లేకపోవడంతో డ్రైవర్లూ ఆయా కార్లలోనే పడి ఉండాల్సిందే.. కనీసం తాగేందుకు నీరూ లేక

కొత్త సచివాలయంలో పార్కింగ్‌ కష్టాలు

మండే ఎండల్లోనే కార్లు, ద్విచక్ర వాహనాలు

కార్ల డ్రైవర్లకు కనీస సదుపాయాలూ కరువే

విశ్రాంతి గది లేనే లేదు.. తాగునీటికీ కటకటే

ఎండ దెబ్బతో వాహనాలకు మరమ్మతులు

మల్టీలెవల్‌ పార్కింగ్‌ ఊసే మరిచారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): వందల కోట్లు ఖర్చు చేసినా నిలువ నీడే లేదు.. చూద్దామన్నా ఒక్క చెట్టూ కనిపించదు... కార్లు, ద్విచక్ర వాహనాలు ఎండలో మగ్గాల్సిందే.. విశ్రాంతి గది లేకపోవడంతో డ్రైవర్లూ ఆయా కార్లలోనే పడి ఉండాల్సిందే.. కనీసం తాగేందుకు నీరూ లేక అల్లాడాల్సిందే... గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలో పరిస్థితి ఇదీ. బీఆర్‌ఎస్‌ పాలనలో వందల కోట్లు ఖర్చు చేసి సచివాలయం నిర్మించినా.. ప్రాథమికంగా కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఎండలు, వానల సమయంలో సచివాలయ ఉద్యోగుల నుంచి వాహనాల డ్రైవర్ల వరకూ ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మంత్రులు, అధికారుల వాహనాలకు డ్రైవర్లుగా వచ్చే వారు ఎండాకాలంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలు లేక తిప్పలు పడుతున్నారు. సాధారణగా భారీ భవనాలకు అండర్‌ గ్రౌండ్‌ సెల్లార్‌లో పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తుంటారు. కానీ, కొత్త సచివాలయాన్ని ఇందుకు భిన్నంగా నిర్మించారు. సచివాలయ ప్రాంగణంలో మల్టీ లెవల్‌ పార్కింగ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులు ప్రతిపాదించినా అది కాగితాలకే పరిమితమైంది. ఫలితంగా సచివాలయం ప్రాంగణంలో ఎండలోనే కార్లను పార్కింగ్‌ చేయాల్సి వస్తోంది. మార్చి నుంచే ఎండలు దంచి కొడుతుండడం, గంటల తరబడి వాహనాలు ఎండలోనే ఉండడంతో ఇంధనం ఆవిరైపోతుందని, మైలేజీ తగ్గిపోతుందని డ్రైవర్లు చెబుతున్నారు. వాహనాలకు తరచూ మెయింటనెన్స్‌ సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. విశ్రాంతిగది లేకపోవడంతో వాహనాల్లోనే తాము భోజనం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ర్టిక్‌ వాహనాలకు మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. సెక్రటేరియట్‌ పార్కింగ్‌ ఏరియాలో నీళ్లు తాగేందుకు చలివేంద్రాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒక్క చెట్టూ మిగల్లేదు..

పాత సచివాలయంలో ఎటూ చూసినా పెద్ద పెద్ద చెట్లుండేవి. డ్రైవర్లు, సందర్శకులు కూడా ఆ చెట్ల కింద సేద తీరేవారు. డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గది కూడా అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుత సచివాలయంలో నిలువ నీడే లేకుండా పోయింది. కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో తాత్కాలికంగా బీఆర్‌కే భవన్‌కు తరలించినపుడు కూడా వాహనాల పార్కింగ్‌ కోసం ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను వినియోగించుకున్నారు. కానీ, ఇపుడు అక్కడికి వెళ్లి రావాలంటే ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతోంది. పైగా అఽధికారులు ఎపుడు పిలుస్తారో, ఎటు వెళ్లాలంటారో తెలియదు. దాంతో డ్రైవర్లు ఇక్కడే ఉండి పోవాల్సి వస్తోంది. ఎంత పెద్ద చెట్టునైనా ఒక చోట నుంచి మరోచోటకు తరలించే సాంకేతికత అందుబాటులో ఉన్నా.. పాత సచివాలయంలో ఉన్న చెట్లను ఎందుకు సంరక్షించలేకపోయారనే వాదనలు వస్తున్నాయి. కనీసం కొత్త సచివాలయంలో నీడనిచ్చే మొక్కలు నాటి ఉన్నా.. ఈ పాటికి చెట్లుగా మారి ఉండేవని అంటున్నారు.

Updated Date - Apr 06 , 2024 | 04:32 AM

Advertising
Advertising