ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Protest: సీఎం దృష్టి పడొద్దని.. దిష్టి తీసి వినూత్న నిరసన

ABN, Publish Date - Oct 03 , 2024 | 10:37 AM

మూసీ సుందరీకరణ పేరిట తమ ఇళ్లు కూల్చొద్దంటూ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి తమ ఇళ్లపై పడొద్దంటూ చైతన్యపురి డివిజన్‌ వినాయకనగర్‌ కాలనీలో మహిళలు బుధవారం రాత్రి తమ ఇళ్లకు దిష్టి తీశారు.

దిల్‌సుఖ్‌నగర్‌: మూసీ సుందరీకరణ పేరిట తమ ఇళ్లు కూల్చొద్దంటూ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి తమ ఇళ్లపై పడొద్దంటూ చైతన్యపురి డివిజన్‌ వినాయకనగర్‌ కాలనీలో మహిళలు బుధవారం రాత్రి తమ ఇళ్లకు దిష్టి తీశారు. పీతృ అమావాస్య రోజు తమ ఇళ్లకు రివర్‌ బెడ్‌ పేరిట పట్టిన పీడ వదిలిపోవాలంటూ కుంకుమ నీటితో దిష్టి తీసి ఇళ్ల ముందు ఆరబోశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఇళ్ల జోలికిరావద్దని కోరారు.

మా ఇళ్లు కూల్చొద్దు బతుకమ్మ..

‘హైడ్రా నుంచి కాపాడు బతుకమ్మ.. మా ఇళ్లు కూల్చొద్దు బతుకమ్మ’ అంటూ ఫిల్మ్‌నగర్‌ చెరువు వద్ద మహిళలు బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. హైడ్రాను వ్యతిరేకిస్తూ ‘వుయ్‌ వాంట్‌ జస్టిస్‌’ అన్న ప్లకార్డులు ప్రదర్శించారు.


వారికి డబుల్ బెడ్రూంలు..

మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకుని ఉంటూ స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసేవారికి ప్రభుత్వం ఆఫర్‌ ఇచ్చింది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటితోపాటు రూ.25 వేలు పారితోషికంగా ప్రభుత్వం ఇస్తుందని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఉండే ఇంటిని ఖాళీ చేసి వెళ్లేందుకు, అవసరాల నిమిత్తం పాతిక వేలు ఇస్తామని ప్రకటించారు. రాజేంద్రనగర్‌, గండిపేట్‌ మండలాలలో విస్తరించి ఉన్న మూసీ రివర్‌బెడ్‌ ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న వారు రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం, రాజేంద్రనగర్‌ ఆర్డీవో కార్యాలయాల వద్ద గ్రీవెన్స్‌ సెల్‌లను సంప్రదించాలని అధికారులు సూచించారు.


విషాదం..

అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్‌ మూసీ పరివాక ప్రాంతం న్యూ తులసీరాంనగర్‌(లంక బస్తీ)కి చెందిన గానద శ్రీకుమార్‌(51) గుండెపోటుతో మృతి చెందారు. ఇండ్లను కూల్చివేస్తారనే ప్రచారం జోరుగా జరగడంతో నాలుగైదు రోజులుగా బెంగగా ఉన్న ఆయన బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఛాతీలో నొప్పి ఉందని కుటుంబసభ్యులతో చెప్పారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందారు.


Gold Prices Today: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగాయ్

Konda Surekha: ఛీ ఛీ.. అసహ్యమేస్తోంది .. కొండా సురేఖపై జూ.ఎన్టీఆర్, నాని మండిపాటు

Naga Chaitanya: సిగ్గు.. సిగ్గు.. సురేఖ కామెంట్స్‌పై నాగచైతన్య మండిపాటు

Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే


For Latest News and Telangana News click here

Updated Date - Oct 03 , 2024 | 11:02 AM