ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాలుగేళ్లుగా ‘10’లో వందశాతం ఉత్తీర్ణత

ABN, Publish Date - Oct 28 , 2024 | 12:29 AM

క్రమశిక్షణలో కూడిన విద్యయే విద్యార్థినిల భవిష్యత్తుకు బాటలు వేస్తుందనేది నానుడి. ఇందుకు అనుగుణంగా మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు నాలుగేళ్లుగా కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రతి ఏటా వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు.

మోటకొండూర్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణలో కూడిన విద్యయే విద్యార్థినిల భవిష్యత్తుకు బాటలు వేస్తుందనేది నానుడి. ఇందుకు అనుగుణంగా మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు నాలుగేళ్లుగా కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రతి ఏటా వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. మోటకొండూర్‌ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను 2017-18లో 5, 6, 7 తరగతి నుంచి ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు నాలుగేళ్లుగా వరుసగా 100శాతం ఉత్తీర్ణతోపాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించింది. మండల కేంద్రంలో ఓ ప్రయివేట్‌ భవనంలో విశాలమైన క్రీడా ప్రాంగణం, డార్మెంటరీ హాలు, తరగతి గదులు, నాణ్యమైన భోజనం, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతీ విద్యార్థినిపై ప్రత్యేక శ్రద్ధ, ప్రతీరోజు, వారాంతపు టెస్టులు, కఠినమైన సబ్జెక్టులపై పరీక్ష నిర్వహణ, ప్రత్యేక తరగతులతో పాటు కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా విద్యను అందిస్తున్నారు.

2017-18లో ప్రారంభమైన గురుకుల పాఠశాల

2017-18లో 5, 6, 7, తరగతులతో ప్రారంభం కాగా, మొదటి పదో తరగతి విద్యాసవత్సరంలో భాగంగా 2020-21లో 78 మంది విద్యర్థినులు పదో తరగతి పరీక్షలు రాయగా వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 37 మంది విద్యార్థినులు 10 జీపీఏ సాధించడం విశేషం. 2021-22లో 79 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 12 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.. 2022-23లో 78 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకరు 10 జీపీఏ సాధించారు. 2023-24లో 81 మది విద్యార్థినిలు పరీక్షలు రాయగా వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.

వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి

ఉత్తమ ఫలితాలు సాధించే విద్యార్థినుల కన్నా వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం. వరుసగా నాలుగోసారి ‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించడం చాలా సం తోషంగా ఉంది. విద్యార్థినులకు మెరుగైన విద్య, వసతి, నాణ్యమైన భోజనంతో పాటు, క్రీడల్లో రాణించడం విషయాలపై ప్రత్యేక దృష్టిసారిస్తాం.

-జ్యోతి, ప్రిన్సిపాల్‌, మహాత్మా జ్యోతిబా గురుకుల పాఠశాల, మోటకొండూర్‌

కష్టపడి చదివాను

కార్పొరేటు విద్యాసంస్థలకు దీటుగా మోటకొండూరు మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యను అందిస్తున్నారు. ఈ రోజుల్లో కార్పోరేటు కాళాశాలల్లో చదవలంటే లక్షల్లో ఖర్చవుతుంది. మాది వ్యవసాయ కుటుంబం పట్టుదలతో కష్టపడి చదివి ఇంటర్‌లో మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంక్‌ మార్కులు సాధించాను.

-మహాలక్ష్మి, మాసాయిపేట, యాదగిరిగుట్ట మండలం

వార్షిక పరీక్షల్లో 10 జీపీఏ సాధిస్తా

మా అమ్మానాన్నలు కూలి పనులు చేసుకుంటూ నన్ను మోటకొండూరులోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు నాణ్యతతో కూడిన విద్యను భోదిస్తున్నారు. పదో తరగతి విద్యర్థినిలపై ప్రత్యేక దృష్టి పెట్టి చదివిస్తున్నారు. రానున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో 10 జీపీఏ సాధిస్తానన్న నమ్మకం నాకుంది.

-సిరిచందన, పదో తరగతి, దిలావర్‌పూర్‌, మోటకొండూరు మండలం

Updated Date - Oct 28 , 2024 | 12:29 AM