ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పిడుగుపాటుకు 44 జీవాలు మృతి

ABN, Publish Date - Oct 19 , 2024 | 12:47 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం పిడుగుపాటుకు వేర్వేరుచోట్ల 44జీవాలు మృతి చెం దాయి.

నేరేడుచర్ల మండలం బోడల్‌దిన్న గ్రామంలో పిడుగు పాటుకు చెల్లాచెదురై మృతి చెందిన మేకలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఘటన

నేరేడుచర్ల, మాడ్గులపల్లి, గరిడేపల్లి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం పిడుగుపాటుకు వేర్వేరుచోట్ల 44జీవాలు మృతి చెం దాయి. అందులో 39 గొర్రెలు, నాలుగు మేకలతో పాటు ఒక గేదె కూడా ఉంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బోడల్‌దిన్న గ్రామంలో మల్లెపూల లింగయ్య, యలకాని ఆంజనేయులుకు చెందిన 300గొర్రెలను బోడల్‌దిన్న శ్మశానవాటిక వద్ద మేపుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వర్షం పడుతుండడంతో కొన్ని గొర్రెలు శ్మశానవాటికలోని షెడ్‌లోకి, మరికొన్ని చెట్ల కిందకు వెళ్లాయి. ఇంతలోనే మెరుపులు ఉరుములతో ఒక్కసారిగా పిడుగు పడటంతో చెట్ల కింద ఉన్న 39 గొర్రెలు మృతి చెందాయి. వీటివిలువ సుమారు రూ.6లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం అభంగాపురం గ్రామంలో బోయ మల్లయ్యలకు చెందిన మేకలు మేత కోసం గ్రామశివారులోకి వెళ్లాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో పిడుగుపడి నాలుగు మేకలు మృతి చెందాయి. మేకల విలువ రూ.50 వేల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. మేకలపై ఆధారపడి జీవిస్తున్న తనను ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు మల్లయ్య ప్రభుత్వాన్ని కోరాడు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సోమ్లాతండాలో గ్రామానికి చెందిన పుసింగ్‌ బీచానాయక్‌ పాడి గేదె పిడుగుపాటుకు గురై మృతి చెందింది. గేదె ధర సుమారు రూ.50 వేలు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.

Updated Date - Oct 19 , 2024 | 12:47 AM