ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రూపు-3కి 53శాతం హాజరు

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:21 AM

గ్రూపు-3 పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో 88 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 28,353 మంది అభ్యర్థులకు 15,257 మంది హాజరయ్యారు.

కాకతీయ డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రం వద్ద సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎస్పీ

నల్లగొండ, నల్లగొండ క్రైం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రూపు-3 పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో 88 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 28,353 మంది అభ్యర్థులకు 15,257 మంది హాజరయ్యారు. 13,096 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 53.81శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాశారని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. కాగా, పట్టణంలోని కాకతీయ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తనిఖీచేసి పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో ఆదివారం, సోమవారం బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఆయన వెంట ఏఎస్పీ రాములునాయక్‌, డీఎస్పీ శివరాంరెడ్డి, టూటౌన్‌ సీఐ డానియల్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 01:21 AM