ఆత్మహత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదు
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:44 AM
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు కారకులైన ఆరుగురిపై కేసు నమోదైనట్లు యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి ఎస్‌హెచవో సంతో్‌షకుమార్ తెలిపారు.
భువనగిరి రూరల్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు కారకులైన ఆరుగురిపై కేసు నమోదైనట్లు యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి ఎస్‌హెచవో సంతో్‌షకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన సుబ్బూరి మౌనికకు అదే మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన మల్లెల మహేందర్‌తో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఈ దంపతులు మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో నివాసముంటున్నారు. వీరికి కుమార్తె ఆద్య, కుమారుడు శెర్యిన ఉన్నారు. ఈ నెల 4న రాత్రి సమయంలో భర్త మహేందర్ తాగిన మైకంలో మౌనికను కొడుతున్నాడని మహేందర్ అన్న నరేందర్ మౌనిక తండ్రి సుబ్బూరి చంద్రమౌళికి ఫోన చేసి చెప్పాడు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి మౌనిక, ఇద్దరు పిల్లలను భర్త మహేందర్ సోదరుడు నరేందర్‌లు చందుపట్లలోని ఆమె పుట్టింటిలో విడిచివెళ్లారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 5న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. తన కుమార్తె ఆత్మహత్యకు వరకట్న వేధింపులు కారణమని భర్త మల్లెల మహేందర్, అత్త పద్మ, మామ మల్లేశ, బావ నరేందర్, తోటి కోడలు ప్రియాంక, ఆడపడుచు అలివేలుపై తండ్రి చంద్రమౌళి ఫిర్యాదు చేసినట్లు సంతో్‌షకుమార్ తెలిపారు. ఆ మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచవో తెలిపారు.
చిన్నారులకు న్యాయం చేయండి
తల్లిని కోల్పోయిన కుమార్తె ఆద్య, కుమారుడికి శెర్యినలకు న్యాయం చేయాలంటూ భువనగిరి పోలీ్‌సస్టేషన ఎదుట శుక్రవారం మౌనిక బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. చిన్నారులు కూడా రాస్తారోకోలో పాల్గొన్నారు. చిన్నారుల తండ్రి మహేందర్‌కు ఉన్న ఆస్తిలో చిన్నారులపై రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ చేయడంతో పాటు ఆరు ఎకరాల వ్యవ సాయ భూమి రిజిస్ట్రేషన చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు మహేందర్ తండ్రి మల్లేష్ ఒప్పుకోకపోవడంతో సమీపంలోని భువనగిరి-జగదేవ్‌పూర్ రహదారిపై సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. దీంతో ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి. న్యాయం జరిగే వరకు రాస్తారోకో విరమింపచేయమని బీష్మించడంతో డీసీపీ రాజేశ చంద్ర, ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, భువనగిరి రూరల్ ఎస్‌హెచవో సంతో్‌షకుమార్‌లు జోక్యం చేసుకుని ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేయించారు. అనంతరం రాకపోకలను పునరుద్ధరించారు.
Updated Date - Dec 07 , 2024 | 12:44 AM