‘చేనేత’కు చేయూత
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:56 AM
‘చేనేతను ఆదుకోవాలి..అందరూ చేనేత వస్ర్తాలనే ధరించాలి. స్వదేశీ వస్తువులనే ఆదరించాలి’ ఆనే నినాదాలను నినాదాలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు ది పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన బ్యాంకు సిబ్బంది. ప్రతీ శనివారం చేనేత వస్ర్తాలను ధరించి ఆదర్శంగా నిలుస్తున్న అర్బనబ్యాంకు సిబ్బందిపై కథనం..
ప్రతీ శనివారం చేనేత వసా్త్రలనే ధరిస్తున్న పోచంపల్లి అర్బనబ్యాంకు సిబ్బంది
‘చేనేతను ఆదుకోవాలి..అందరూ చేనేత వస్ర్తాలనే ధరించాలి. స్వదేశీ వస్తువులనే ఆదరించాలి’ ఆనే నినాదాలను నినాదాలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు ది పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన బ్యాంకు సిబ్బంది. ప్రతీ శనివారం చేనేత వస్ర్తాలను ధరించి ఆదర్శంగా నిలుస్తున్న అర్బనబ్యాంకు సిబ్బందిపై కథనం..
భూదానపోచంపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులకు, కళాకారులకు తమ వంతు సహకారం అందించాలనే సదుద్దేశంతో చేనేత వసా్త్రలను ధరిస్తూ పలువురికి ఆదర్శగా నిలుస్తున్నారు భూదానపోచంపల్లి పట్టణంలోని ది పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన బ్యాంకు సిబ్బంది. చేనేత వస్త్ర ధారణ చూసి పోచంపల్లి బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు ఆకర్షితులయ్యేందుకు ప్రతీ శనివారం బ్యాంకు సిబ్బంది చేనేత ఇక్కత వసా్త్రలను ధరించాలనే ఉద్దేశం కలిగిన వెంటనే వారు ఆచరణలో పెట్టారు. అయితే ఇందుకోసం అర్బన బ్యాంకు చైర్మన తడక రమేష్ స్పందించి బ్యాంకులోని 30 మంది సిబ్బందికి అవసరమైన చేనేత దుస్తులను ఉచితంగా అందజేశారు. ప్రతీ శనివారం చేనేత వసా్త్రలను ధరించడంతోపాటు బ్యాంకుకు వచ్చే వారికి చేనేత వసా్త్రలు ధరించేలా ఆలోచన కలించేలా చేయడంపై చేనేత కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘చేనేత వసా్త్రలు ధరించి చేనేత కార్మికులకు చేయుతనిద్దాం’ అనే సందేశాన్ని చాటుతున్న పోచంపల్లి బ్యాంకు సిబ్బందిని చేనేత వర్గాలు అభినందిస్తున్నాయి.
చేనేత వసా్త్రలను ధరించాలనే..
చేనేత వసా్త్రలను ధరిస్తే శరీరాని కి ఎంతో మేలు కలుగుతుంది. మా వంతు బాధ్యతగా చేనేత వసా్త్రలను ధరించడమే కాకుండా చేనేతను కాపాడాలనే ప్రచారం కూడా నిర్వహిస్తున్నామనే సంతృప్తి కలుగుతోంది.
- రాచకొండ మధుసూదన, సీనియర్ మేనేజర్, పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బనబ్యాంకు
కార్మికులకు పని కల్పించాలనే లక్ష్యంతో..
చేనేత వసా్త్రలను ప్రతి ఒక్కరూ ధరించాలి. చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించాలనే సంకల్పంతో బ్యాంకు సిబ్బంది చేనేత వసా్త్రలను ధరిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది ప్రతీ శనివారం చేనేత వసా్త్రలు ధరించాలనే నిబంధన పెట్టాం. అయితే సిబ్బందికి అవసరమైన చేనేత వసా్త్రన్ని ఉచితంగా అందిచాం. చేనేత సంక్షేమం కోసం మేము సైతం అన్నట్లుగా మా బ్యాంకు సిబ్బంది ఈ చిన్న ప్రయత్నం. ఇందుకు ఎంతో హర్షిస్తున్నాను.
- తడక రమేష్, చైర్మన. ది పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన బ్యాంకు
Updated Date - Nov 20 , 2024 | 12:56 AM