ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలి

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:44 AM

ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. మంగళవా రం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. మంగళవా రం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బహిరంగ మల, మూత్ర విసర్జన వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపించే అవకాశముందన్నా రు. మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా జిల్లాలో నేటి నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టంచేశారు. పరిశుభ్రమైన మరుగుదొడ్లను గుర్తించి అవార్డులు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్‌డీవో అప్పారావు, డీఎ్‌ఫవో సతీ్‌షకుమార్‌, డీపీవో నారాయణరెడ్డి, డీఈవో అశోక్‌, జిల్లా సంక్షేమాధికారులు నర్సింహారావు, శంకర్‌, డీఎంహెచ్‌వో కోటాచలం, మిషన్‌ భగీరథ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం

సూర్యాపేటక్రైం: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్‌ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన టెన్నిస్‌ కోర్టును ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ప్రతీరోజు ఏదో ఒక సమయంలో క్రీడలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు మేక నాగేశ్వర్‌రావు, జనార్దన్‌రెడ్డి, డీఎస్పీలు జి. రవి, నర్సింహ్మాచారి, సీఐ సురేందర్‌రెడ్డి, ఆర్‌ఐ నారాయణరాజు పాల్గొన్నారు.

మునగాల రూరల్‌: జిల్లాలో ఆయిల్‌పాం సాగు చేసే రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాలని కలెక్టర్‌ తేజస్‌ నందాలాల్‌ పవార్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో పతంజలి ఆయిల్‌పాం కంపెనీ పెంచుతున్న నర్సరీని కలెక్టర్‌ పరిశీలించారు. నర్సరీకి ఇతర దేశాల నుంచి వచ్చే మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొక్కల పెంపకంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, మెలకువలు తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య, సాంకేతిక ఉద్యాన అధికారి మహేష్‌, పతంజలి డీజీఎం బి.యాదగిరి, మేనేజర్‌ హరీష్‌, నర్సరీ ఆఫీసర్‌ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 12:44 AM