వ్యక్తి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:32 AM
చేతబడి నెపంతో ఓ వ్యక్తిని హత్యచేసిన నిందితుడికి జీవితఖైదు విధిస్తూ సూర్యాపేట ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి ఎస్. గోవర్థనరెడ్డి శుక్రవారం తీర్పు వెల్లడించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
సూర్యాపేటలీగల్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): చేతబడి నెపంతో ఓ వ్యక్తిని హత్యచేసిన నిందితుడికి జీవితఖైదు విధిస్తూ సూర్యాపేట ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి ఎస్. గోవర్థనరెడ్డి శుక్రవారం తీర్పు వెల్లడించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. పెనపహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన రణపంగు దానయ్య వ్యవసాయం చేస్తుంటాడు. చేతబడి చేసి తన తనతండ్రిని చంపాడని నెపంతో 2018 సెప్టెంబరు 8వ తేదీ రాత్రి సుమారు 8గంటల ప్రాంతంలో అదేగ్రామానికి చెందిన రక్తసంబంధికుడైన రణపంగు రామయ్య పశువుల కొట్టం ఉండగా రోకలిబండతో దాడి చేశాడు. అనంతరం తీవ్రగాయాలైన రామయ్య మృతి చెందాడని భావించి వెళ్లిపోయాడు. రామయ్య కోడలు విజయ 108 వాహనంలో సూర్యాపేట ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. బాధితుడు రామయ్య రెండు రోజులు చికిత్స పొందుతూ సెప్టెంబరు 10వ తేదీన మృతి చెందాడు. విజయ ఫిర్యాదు మేరకు అప్పటి ఏఎ్‌సఐ కనకరత్నం కేసు నమోదు చేయగా సీఐలు ప్రవీణ్‌కుమార్, జీ వెంకట్‌రెడ్డి పరిశోధన అధికారులుగా నిందితులపై అభియోగపత్రాలు దాఖలుచేశారు. 16మంది సాక్ష్యులను విచారించిన కోర్టు నిందితుడిపై అభియోగాలు నిర్థారణ కావడంతో రణపంగు దానయ్యకు జీవితఖైదు విధించడంతో పాటు రూ.500 జరిమానా విధించారు.
Updated Date - Dec 07 , 2024 | 12:32 AM