యాసంగికి ముందస్తు ప్రణాళిక
ABN, Publish Date - Oct 25 , 2024 | 01:11 AM
యాసంగి సీజన్ అక్టోబరు మొదటి వారంలో ప్రారంభంకానుంది. అందుకు వ్యవసాయశాఖ ఇప్పటికే ముందస్తు ప్రణాళిక రూపొందించింది. సాగర్ ఆయకట్టులో వానాకాలం సాగు నెల రోజులు ఆలస్యం కాగా, యాసంగి సీజన్ సాగు అక్టోబరులో రెండో లేదా లేదా మూడో వారంలో ప్రారంభంకానుంది.
గత ఏడాది కంటే 1.36లక్షల ఎకరాలు పెరగనున్న వరిసాగు
నకిలీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలపై పటిష్ట నిఘా
జేడీఏ పి.శ్రవణ్‌కుమార్‌తో
(ఆంధ్రజ్యోతి, నల్లగొండ): యాసంగి సీజన్ అక్టోబరు మొదటి వారంలో ప్రారంభంకానుంది. అందుకు వ్యవసాయశాఖ ఇప్పటికే ముందస్తు ప్రణాళిక రూపొందించింది. సాగర్ ఆయకట్టులో వానాకాలం సాగు నెల రోజులు ఆలస్యం కాగా, యాసంగి సీజన్ సాగు అక్టోబరులో రెండో లేదా లేదా మూడో వారంలో ప్రారంభంకానుంది. నాన్ ఆయకట్టులో మొదటి వారంలోనే ప్రారంభం కానుంది. 2023 యాసంగిలో 4,20,523ఎకరాల్లో వరిసాగు కాగా, 2024-25 యాసంగిలో 5,56,920ఎకరాల్లో వరిసాగు కానుంది. గత ఏడాది కంటే 1,36,397ఎకరాల్లో వరిసాగు కానుంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి పి.శ్రవణ్‌కుమార్ ‘ఆంధ్రజ్యోతి’ ఇంట ర్వ్యూ విశేషాలు ఇలా..
ఆంధ్రజ్యోతి: యాసంగిలో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగవుతాయి?
జేడీఏ: 2023 యాసంగిలో వరితో పాటు ఇతర పంటలు 4,44,041లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది యాసంగిలో 5,83,620లక్షల్లో సాగవుతాయని అంచనా. అందులో వరి 5,56,920 ఎకరాలు, వేరుశనగ 21వేల ఎకరాలు, పెసర్లు 2వేల ఎకరాల్లో సాగు కానున్నాయి.
ఆం: విత్తనాల పరిస్థితి ఏంటి?
జేడీఏ: విత్తనాలకు ఇప్పటికే ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాం. కొన్ని విత్తనాలు అందుబాటులో ఉండగా, నెలాఖరులోగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. వరి విత్తనాలు 1,39,230 క్వింటాళ్లు అవసరం. అందులో ఎంటీయు 1010 రకం, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కేఎన్‌ఎం-118, జేజీఎల్ రకాలు ఉంటాయి. మినుములు 80 క్వింటాళ్లు, పెసర్లు 160 క్వింటాళ్లు, వేరుశనగ 22,059 క్వింటాళ్లు రైతులకు పంపిణీ చేస్తాం.
ఆం: ఎరువులు ఎంత అవసరం?
జేడీఏ: వచ్చే యాసంగి సీజన్‌కు మొత్తం 1,54,531 మెట్రిక్ టన్నుల ఎరువుల కోసం ఇండెంట్ పెట్టాం. ఆరు నెలలకు సంబంధించి యూరియా 71,066 మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఇప్పటికే 24వేల మెట్రిక్‌టన్నుల యూరియా నిల్వ ఉంది. అందులో దుకాణాల్లో 7వేల మెట్రిక్ టన్నులు ఉండగా, గోదాముల్లో 17వేల మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. డీఏపీ 17,917 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 14,078 మెట్రిక్‌టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 44,303 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎ్‌సపీ 7,167మెట్రిక్ ట న్నులు అవసరం.
ఆం: ఈ సీజన్‌లో వరి ఏ రకం ఎక్కువగా సాగయ్యే అవకాశాలు ఉన్నాయి?
జేడీఏ: రైతులు దొడ్డు రకంతో పాటు సన్నరకం ధాన్యం సాగు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం సన్నరకం వరిని సాగు చేస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నందున ఈ రకం సాగుకు రైతులు మొగ్గుచూపే అవకాశం ఉంది. వేరుశనగ అత్యధికంగా దేవరకొండ డివిజన్‌లో సాగవనుంది.
ఆం: ఎరువులు, విత్తనాల కొనుగోలులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
జేడీఏ: ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దుకాణాల్లో మాత్రమే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలి. దళారులను నమ్మి విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దు. ఏ కొనుగోలు అయినా రశీదు తీసుకొని సీజన్ పూర్తయ్యే వరకు దగ్గర ఉంచుకోవాలి. విత్తనం, లేదా ఎరువు తయారు తేదీ, మన్నిక గడువును జాగ్రత్తగా చేసుకోవాలి.
ఆం: నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులపై నిఘా ఎలా ఉండనుంది?
జేడీఏ: నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులపై వ్యవసాయశాఖ పటిష్ట నిఘా ఉంటుంది. ఇటీవల మిర్యాలగూడలో చెస్ కంపెనీకి సంబంధించిన నకిలీ మందులను గుంటూరు జిల్లా నుంచి దామరచర్ల మీదుగా చేర్చడంతో గుర్తించి ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. నకిలీ మందులు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్య లు తీసుకుంటాం. అదేవిఽధగా ఎరువుల అందుబాటుపై ప్రతీ వారంలో ఐదు రోజుల పాటు పైవ్ (ఫర్టిలైజర్ ఇన్‌వెండరీ వెరిఫికేషన్ సిస్టం) యాప్ ద్వారా నిల్వల గురించి నమో దు చేయిస్తాం. దుకాణాల్లో నూటికి నూరు శాతం తనిఖీ చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం.
Updated Date - Oct 25 , 2024 | 01:11 AM