ఆలేరు ఆస్పత్రిని 50 పడకలకు మార్చుతాం
ABN, Publish Date - Sep 07 , 2024 | 12:44 AM
ఆలేరు ఆస్పత్రిని 30 పడకల నుంచి 50కి పెంచేందు కు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నా రు. శుక్రవారం ఆలేరులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతు కే.జెండగేతో కలిసి తనిఖీచేశారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
ఆలేరు రూరల్, సెప్టెంబరు 6: ఆలేరు ఆస్పత్రిని 30 పడకల నుంచి 50కి పెంచేందు కు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నా రు. శుక్రవారం ఆలేరులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతు కే.జెండగేతో కలిసి తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అం దుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అం దించాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమన్నారు. ఆలేరు ఆస్పత్రిలో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నారని వైద్యులను, సిబ్బంది అభినందించా రు. కొంతమంది రాజకీయ నాయకులు కావాలనే దురుద్దేశంతో ఆస్పత్రిపై రాజకీయం చేస్తున్నారని, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలన్నారు. ఆలేరును అన్ని విధాలా అగ్రగామిగా నిలిపేందు కు అన్ని పార్టీలు సహకరించాలన్నారు. ప్రస్తుతం 10 పడకలతో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని 20 పడకలుగా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనర్సింహను కలిసి మాట్లాడతానన్నారు. ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తేగా డీసీహెచ్‌ఎ్‌స నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు. అనంతరం బైరాంనగర్ గ్రామస్థులు తమ గ్రామాన్ని పంచాయతీగా ప్రకటించడంపై ప్రభుత్వ విప్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న రాథోడ్, మునిసిపల్ కమిషనర్ లక్ష్మి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీలు గంధమల్ల అశోక్, చీర శ్రీశైలం, నాయకులు వెంకటేశ్వర్‌రాజు, ఎజాజ్, శ్రీనివా్‌సరెడ్డి, సాగర్‌రెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 07 , 2024 | 12:44 AM